Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: బన్నీకి 75 కోట్లు.. ఆ విషయంలో బాలయ్యే ఆదర్శం !

Allu Arjun: బన్నీకి 75 కోట్లు.. ఆ విషయంలో బాలయ్యే ఆదర్శం !

Allu Arjun: ‘పుష్ప’ సినిమా సూపర్‌ హిట్ తర్వాత మరో పాన్ ఇండియా సినిమాకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్ నిర్మించే ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా రూ.75 కోట్ల రెమ్యునరేషన్ అడిగినట్లు వార్తలొస్తున్నాయి. అందుకు ఆ సంస్థ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్లు అట్లీ, మురుగదాస్‌లలో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.

Allu Arjun

అలాగే, బన్నీ… బాలయ్య, ఎన్టీఆర్ లను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలతో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి నట వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు హోస్టులుగానూ మంచి ఆదరణ పొందారు. ఇక బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ అయితే సూపర్ సక్సెస్ అయింది. వీరిద్దరిలా అల్లు అర్జున్ కూడా త్వరలో ‘ఆహా’లో ఓ షోను హోస్ట్ చేస్తాడని తెలుస్తోంది. కుటుంబ సంస్థ కావడంతో ఇందుకు బన్నీ కూడా సుముఖంగా ఉన్నాడని తెలుస్తోంది.

Also Read:  ‘బాలయ్య – మహేష్’ ఎపిసోడ్ ఫుల్ డిటైల్స్ ఇవే !

nandamuri bala krishna going to do a movie with director sampath nandi

ఇక ఈ షో గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ‘పుష్ప’ను అభిమానులు, సినీ ప్రముఖులే రాజకీయ నాయకులు కూడా బాగా మెచ్చుకుంటున్నారు. మెచ్చుకునే క్రమంలో బాగా వాడుకుంటున్నారు కూడా. అసలు ఎక్కడ చూసిన ‘పుష్ప’ ఫీవరే కనిపిస్తుంది ఇప్పుడు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పుష్పరాజ్‌ డైలాగ్‌ ను ఎంచుకుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ స్టిల్‌ ను ఎడిట్‌ చేసి బన్నీకి మాస్క్‌ పెట్టింది. మొత్తానికి బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

Also Read:  ‘సమరసింహారెడ్డి’ తర్వాత మళ్లీ ‘అఖండ’కే వచ్చా – బాలయ్య

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

  1. […] India Corona Upadate: అనుకున్నట్టే అవుతోంది. భారతదేశం క్రమంగా థర్డ్ వేవ్ లోకి జారిపోతోంది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మొన్న రోజుకు 3 లక్షలు దాటిన కొత్త కేసులు తాజాగా 347254కు పెరిగాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 19 లక్షల కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. దేశంలో పాజిటివిటీ రేటు ఏకంగా 17.94 శాతానికి ఎగబాకడం ఆందోళన కలిగిస్తోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular