Chikiri Chikiri song rocking Instagram: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం చేస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై రోజురోజుకి అంచనాలు భారీ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ లో విడుదల చేసిన ‘పెద్ది షాట్’ మొదటి గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గానే విడుదల చేసిన ‘చికిరి చికిరి’ పాటకు అయితే సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్ లో ఊగిపోతోంది. మొదట్లో ఈ పాటపై, ఈ పాట ప్రోమో పై ట్రోల్స్ చాలా గట్టిగా వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం మ్యూజిక్ లవర్స్ ని ఈ పాట తెగ ఆకర్షించేసింది. యూట్యూబ్, జిఓ సావన్, స్పాటిఫై అని తేడా లేకుండా, ఎక్కడ చూసినా ఈ పాటనే ఇప్పుడు ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఈ పాట దేశాలను కూడా దాటేసింది.
తమకు తోచిన విధంగా స్టెప్పులు వేస్తూ రీల్స్ ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు నెటిజెన్స్. ఇన్ స్టాగ్రామ్ లెక్కల ప్రకారం కేవలం ఆరు రోజుల్లోనే ఈ పాట 70 వేలకు పైగా రీల్స్ ని సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. సినిమా ఎప్పుడో మార్చ్ నెలలో విడుదల అవ్వుద్ది. కానీ ఇప్పటి నుండే ఈ స్థాయిలో రీల్స్ కౌంట్ రావడం నిజంగా అరాచకం అనే చెప్పాలి. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, నార్త్ ఇండియన్స్ కూడా ఈ పాటకు వైబ్ అయ్యి స్టెప్పులేస్తున్నారు. కేవలం అప్పట్లో పుష్ప సిరీస్ కి మాత్రమే ఇలాంటి మేనియా కనిపించింది. ఆ తర్వాత దేవర చిత్రం లోని ‘చుట్టమల్లే’ పాటకు కూడా ఇదే రేంజ్ రీచ్ వచ్చింది. ఇప్పుడు పెద్ది కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయింది. యూట్యూబ్ లో ఈ పాటకు రోజుకి మూడు మిలియన్ కి పైగా వ్యూస్ వస్తున్నాయి.
హిందీ వెర్షన్ కి ఇప్పటి వరకు 16 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. మిగిలిన భాషలను కూడా కలిపితే ఈ పాటకు ఓవరాల్ గా 70 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం ఆరు రోజుల్లో ఆర్గానిక్ గా ఒక పాటకు ఇంతటి రేంజ్ రెస్పాన్స్ రావడం చూస్తుంటే రామ్ చరణ్ కి చాలా కాలం తర్వాత మంచి రోజులు మొదలు అయ్యాయి అని అనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో తెలుగు వెర్షన్ సాంగ్ 50 మిలియన్ వ్యూస్ కౌంట్ ని దాటే అవకాశం ఉంది. ఈ వీకెండ్ తో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ తో ఈ పాట మెగాస్టార్ చిరంజీవి ‘మీసాల పిల్ల’ సాంగ్ వ్యూస్ కౌంట్ ని దాటే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
#ChikiriChikiri – biggest chartbuster, biggest sensation
70K+ REELS on Instagram with terrific recreations of the hookstep ❤❤
▶️ https://t.co/bWVCQlNaqD#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor… pic.twitter.com/BE5TyLqbr5
— BuchiBabuSana (@BuchiBabuSana) November 13, 2025