https://oktelugu.com/

సత్తా చాటిన తెలుగు సినిమా.. జాతీయ పురస్కారాలు !

జాతీయ చలనచిత్ర అవార్డులలో సత్తా చాటింది తెలుగు సినీ పరిశ్రమ. క్రియేటివిటీలో తెలుగు వాడు ఎన్నడూ వెనుక పడకపోయినా.. సినీ ప్రపంచంలో మాత్రం జాతీయ అవార్డుల విషయంలో.. తెలుగు సినిమా ఎప్పుడూ ఒక మెట్టు కిందే ఉండేది. కానీ, ఇప్పుడు కాలం మారింది. టాలీవుడ్ లో కొత్త రక్తం వచ్చే సరికి అవార్డులు కూడా దాసోహం అంటున్నాయి. Also Read: ‘పుష్ప’లో పైశాచిక ఆనందం.. బన్నీ వల్లే ! తాజాగా 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను […]

Written By: , Updated On : March 22, 2021 / 05:31 PM IST
Follow us on

Jersey maharshi movie
జాతీయ చలనచిత్ర అవార్డులలో సత్తా చాటింది తెలుగు సినీ పరిశ్రమ. క్రియేటివిటీలో తెలుగు వాడు ఎన్నడూ వెనుక పడకపోయినా.. సినీ ప్రపంచంలో మాత్రం జాతీయ అవార్డుల విషయంలో.. తెలుగు సినిమా ఎప్పుడూ ఒక మెట్టు కిందే ఉండేది. కానీ, ఇప్పుడు కాలం మారింది. టాలీవుడ్ లో కొత్త రక్తం వచ్చే సరికి అవార్డులు కూడా దాసోహం అంటున్నాయి.

Also Read: ‘పుష్ప’లో పైశాచిక ఆనందం.. బన్నీ వల్లే !

తాజాగా 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. అయితే తెలుగు సినిమాలకు భారీ పురస్కారాలు వరించడం నిజంగా విశేషమే. ఒకసారి – 2019 సంవత్సరానికి తెలుగు సినిమాలకు వచ్చిన 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ఒకసారి పరిశీలిస్తే..

– ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
– ఉత్తమ ఎడిటర్ – జెర్సీ(నవీన్ నూలీ)
– ఉత్తమ వినోదాత్మక చిత్రం- మహర్షి
– ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం(మహర్షి)
– ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)

Also Read: బట్టలన్నీ విప్పమన్న దర్శకుడు ఎవరో ?

మొత్తానికి పైన వచ్చిన అవార్డులను చూస్తే.. తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది అని అర్ధం అవుతుంది. ఏది ఏమైనా కలెక్షన్స్ విషయంలో ఎప్పుడూ వెనుక పడని తెలుగు పరిశ్రమ.. మరింత విస్తృతంగా ఎదగాలంటే కావాల్సింది ఇలాంటి నేషనల్ అవార్డులు, రివార్డులే. ఇంకా మరిన్నీ కొత్తతరం సినిమాలు వచ్చి.. ప్రేక్షకులు అభినందనలతో పాటు వారి ప్రేమను కూడా తెలుగు సినీ పరిశ్రమకు దక్కాలని ఆశిద్దాం.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్