Vijay Devarakonda: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న లైగర్ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను రూ.60 కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అన్ని భారతీయ భాషల డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే పూరీ, విజయ్‌ల కెరీర్‌లో ఇదే రికార్డ్ స్థాయిలో కుదిరిన డీల్ అని చెప్పొచ్చు.

అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ ‘లైగర్’ సినిమా టైటిల్ వెనుక చాలా కథ ఉంది. అసలు లైగర్ అనే పేరే కొత్తగా ఉంది అంటూ సినీ జనం కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపించారు. అసలు లైగర్ అంటే ఏంటంటే.. మగ సింహానికి – ఆడ పులికి పుట్టిన దాన్నే లైగర్ అంటారు. అంటే.. సింహం బలం, పులి తెగింపు రెండూ లైగర్ లో ఉంటాయి. సో.. విజయ్ పాత్ర కూడా ఆ స్థాయిలో ఉండబోతోంది.
Also Read: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 500 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?
అందుకే, బాలీవుడ్ లో కూడా ఈ సినిమా అంచనాలు పెరిగాయి. హిందీ బయ్యర్లు ఈ సినిమా తీసుకోవడానికి భారీ మొత్తాన్నే ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. హిందీలో ఈ సినిమాకు బాగా మార్కెట్ కావడానికి ఒక కారణం ఉంది. అనన్య పాండే హీరోయిన్ కావడం, అలాగే బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడంతో హిందీ ప్రేక్షకులకు ఈ సినిమా డైరెక్ట్ హిందీ సినిమా అనే ఫీలింగ్ ను కలిగించింది.

ఇక విజయ్ దేవరకొండను పక్కా బాక్సర్ గా భారీ బిల్డప్ తో పూరి ఈ సినిమాలో చూపించబోతున్నాడు. పైగా విజయ్ కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాడు. మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ తో పాటు ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: దైవభక్తి మెండు.. ప్రస్తుతానికి ఇదే ట్రెండ్.. జగన్ వెళ్లేది అందుకేనా?
[…] Also Read: విజయ్ దేవరకొండ లైగర్ కి 60 కోట్ల డీల్ […]