Lakshmi Gopalaswamy: నటి లక్ష్మీ గోపాలస్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. కర్ణాటకు చెందిన నటి అయినా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించింది. ఈమె నటి మాత్రమే కాదు గొప్ప శాస్త్రీయ నృత్యకారిణి కూడా. ఎక్కువగా మలయాళ సినిమాల్లో నటించిన ఈ నటి తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. జూ. ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ అరవింద సమేత వీర రాఘవ సినిమాలో పూజా హెగ్డేకు తల్లిగా నటించింది. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే వివరాలు మీకోసం..
కెరీర్ లో ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించింది ఈ నటి. ప్రస్తుతం ఈమెకు 4 సంవత్సరాల వయసు. కానీ ఇప్పటికీ ఈమె పెళ్లి చేసుకోకపోవడం ఆశ్చర్యకరం.అవును మీరు విన్నది నిజమే.. ఇప్పటికే ఈ నటి పెళ్లి చేసుకోలేదు. దీనికి ఓ కారణం కూడా ఉంది. 2000 సంవత్సరంలో ముమ్మట్టి హీరోగా నటించిన మలయాళ అరయన్నగళ్ వీడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఈమె నటనకు ఉత్తమ సహాయ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్రం అవార్డును కూడా అందించింది.
ఆ తర్వాత పరదేశి సినిమాలో నటించి ఉత్తమ సహాయ నటిగా మరో అవార్డు అందుకుంది. ఈ విజయంతో కన్నడ ఇండస్ట్రీలో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈమె 40 మలయాళ సినిమాల్లో నటించి మంచి యాక్టర్ గా గుర్తింపు పొందింది. అంతేకాదు ముమ్మట్టి, సురేష్ గోపి, మోహన్ లాల్, జయరామ్ వంటి స్టార్ల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇలా ఈమె నటించిన సీరియల్స్, సినిమాలు చాలా ఉన్నాయి. ఇక ఈమె ఇన్ని విజయాలు, సినిమాలు, స్టార్ హీరోలతో నటించి మంచి పేరు సంపాదించిన కూడా పెళ్లి చేసుకోకపోవడం ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన హోదా, అందం చూసి కాకుండా తనను తనగా ఇష్టపడే వ్యక్తి ఎదురైతే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంటుంది లక్ష్మీ. మరి చూడాలి ఇప్పుడైనా ఈమె అనుకున్నట్టు ఒక మంచి వ్యక్తి ఆమెకు భర్తగా దొరుకుతారా లేదా అనేది.