Mahesh Babu- Trivikram Movie: మన టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు..ఇటీవల విడుదల అయినా సర్కారు వారి పాట సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది..కేవలం హీరో గా మాత్రమే కాదు..నిర్మాతగా కూడా మహేష్ బాబు ఫుల్ జోష్ మీద ఉన్నాడు..ఈరోజు ఆయన నిర్మాతగా అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది..ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి..ఇలా గత నాలుగేళ్ల నుండి మహేష్ బాబు పట్టిందల్లా బంగారం లాగ మారిపోతున్నాయి..ఇక ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చి దాదాపుగా 12 ఏళ్ళు అవుతుంది..ఖలేజా సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరు కలిసి సినిమా చెయ్యలేదు..ఖలేజా కి ముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా టాలీవుడ్ లో ఎలాంటి క్లాసిక్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కానీ ఈ రెండు సినిమాలు ఎందుకో బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పొయ్యాయి..కమర్షియల్ గా రెండు సినిమాలు సక్సెస్ కాలేకపోయినా కూడా కంటెంట్ పరంగా ప్రేక్షుకులు ఇప్పటికి టీవీ లో వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు..అందుకే ఈ కాంబినేషన్ అంటే ట్రేడ్ లో అంత క్రేజ్.

ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని చకచకా పూర్తి చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్..కొద్దీ రోజుల క్రితం పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోనుంది..అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియా లో ఎదో ఒక్కటి ప్రచారం అవుతూనే ఉంది..ఇపుడు లేటెస్ట్ గా ఈ సినిమా చేస్తున్న బిజినెస్ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేస్తుంది.
అదేమిటి అంటే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ అప్పుడే ప్రారంభం అయ్యిపోయింది అట..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపు గా 150 కోట్ల రూపాయిల బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది..అంతే కాకుండా ఆడియో రైట్స్ కి 20 కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నారు అట నిర్మాతలు..వీటితో పాటు డిజిటల్ + సాటిలైట్ రైట్స్ దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పలుకుతున్నట్టు తెలుస్తుంది..వీటితో పాటు హిందీ దుబ్బింగ్ రైట్స్ కూడా భారీ రేట్స్ పలుకుతున్నట్టు తెలుస్తుంది..అలా కనీసం టైటిల్ కూడా పెట్టని ఈ మూవీ అప్పుడే 300 కోట్ల రూపాయిల బిజినెస్ చేస్తుంది అంటే ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Also Read: CM Jagan- Kapu Community: కాపులంటే జగన్ కు ఎందుకంత కోపం? అసలు కథేంటి?
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ని పెట్టేందుకు పరిశీలిస్తున్నారు అట..అంతే కాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు మరో యువ హీరో కూడా నటించే స్కోప్ బాగా ఉంది..ఇప్పటికే హీరో నాని కోసం మూవీ యూనిట్ ట్రై చేసింది..కానీ ఆయన కాల్ షీట్స్ అందుబాటులో లేకపోవడం తో వేరే యువ హీరో కోసం గాలిస్తున్నారు..ఇక ఈ సినిమా లో విలన్ పాత్ర కోసం తమిళ్ లో స్టార్ హీరో గా కొనసాగుతున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కోసం ప్రయత్నిస్తున్నారు అట..కాస్టింగ్ విషయం లో త్రివిక్రమ్ తగ్గేదెలా అనే ధోరణితో ముందుకి పోతున్నాడు అట..ఈ సినిమాని మహేష్ కెరీర్ లోనే చిరస్థాయిగా గుర్తుండిపోయ్యే రేంజ్ క్లాసిక్ గా తయారు చేసేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ చూస్తున్నాడు అట..భీమ్లా నాయక్ సినిమా తో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నారు.
Also Read: Visakhapatnam YCP: విశాఖ వైసీపీలో కుమ్ములాటలు.. ఆధిపత్యం కోసం నేతల ఆరాటం
Recommended Videos:
[…] […]