Salaar Movie Records: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ కోసం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. KGF సిరీస్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడం తో ఈ సినిమా కోసం కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, బాలీవుడ్ , కోలీవుడ్ మరియు మాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎదురు చేస్తున్నారు.
ఇక నేడు ఉదయం 5 గంటల 14 నిమిషాలకు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ముఖం కనపడేటట్టు షాట్స్ ఒక్కటి కూడా చూపించకపోయినా కూడా ,ఈ టీజర్ లోని డైలాగ్ అప్పుడే సోషల్ మీడియా లో మీమెర్స్ తెగ వాడేస్తున్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు, గంటల వ్యవధి లో ఈ టీజర్ ఏ రేంజ్ లో వ్యాప్తి చెందిందో అనేది.
ఇకపోతే ఈ టీజర్ కి కేవలం 7 గంటల్లోనే 25 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి, ఇది టాలీవుడ్ చరిత్రలోనే ఒక రికార్డు గా చూడొచ్చు. తెల్లవారు జామున విడుదల చేసినప్పటికీ కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ ని ఊహించలేకపోయామని అంటున్నారు అభిమానులు. ఇదే ఊపులో ముందుకు పోతే కచ్చితంగా 24 గంటల్లో 70 నుండి 80 మిలియన్ వరకు వ్యూస్ వస్తాయని ఆశిస్తున్నారు.
KGF చాప్టర్ 2 టీజర్ కి కూడా ఇదే రేంజ్ వ్యూస్ వచ్చాయి. ఆ టీజర్ కి అలా అయితే యాడ్స్ పెట్టారో, ఈ టీజర్ కి కూడా అలాగే యాడ్స్ పెట్టారు. కాబట్టి కచ్చితంగా 80 మిలియన్ వ్యూస్ 24 గంటల్లో వస్తాయని అంటున్నారు. ప్రభాస్ షాట్స్ కాస్త బాగా చూపించి ఉంటే 24 గంటల్లో 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చిన ఆశ్చర్యపోయేవాళ్ళం కాదని అంటున్నారు విశ్లేషకులు.