2025 Tollywood Roundup: 2025వ సంవత్సరం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో పెను సంచలతే నమోదయ్యాయి. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లను పక్కన పెడితే కొత్త హీరోలు, కొత్త దర్శకులు వాళ్ళ సత్తాని చాటుకున్నారు. ముఖ్యంగా ఫ్రెష్ కథలతో ప్రేక్షకులను అలరించడంలో దర్శకులైతే సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ సంవత్సరం తమ సినిమాలతో సత్తా చాటుకున్న దర్శకులు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కోర్ట్
కోర్టు సినిమాతో ఫోక్సో చట్టం అనేది ఒకటి ఉందని అందరికి తెలియజేశారు. ఆ కేసు లో ఇరుక్కోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది చాలా క్లియర్ గా తెలియజేసిన దర్శకుడు రామ్ జగదీష్…ప్రస్తుతం నాని బ్యానర్ లోనే మరో సినిమాని చేయడానికి సిద్ధమయ్యాడు…
లిటిల్ హార్ట్స్
బ్యూటిఫుల్ సబ్జెక్టులను ప్రేక్షకులకు అందించి వాళ్ల మెప్పు పొందిన దర్శకుడు సాయి మార్తాండ్…ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయింది. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ లో అయితే ఒక ప్రభంజనాన్ని సృష్టించింది… మొదటి సినిమాతోనే సత్తా చాటుకున్న దర్శకుడిగా సాయి మార్తాండ్ అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు…
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
ప్రస్తుతం పెళ్లి కి ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం అనేది ప్యాషన్ అయిపోయింది. అయితే దానివల్ల అతను ఎలా సఫర్ అవుతాడు అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ కట్ గా చూపించారు. రాహుల్ శ్రీనివాస్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తన మొదటి స్టెప్ నే సక్సెస్ ఫుల్ గా వేయడంతో అతను మరిన్ని మంచి మూవీస్ చేయడానికి ఆస్కారం దొరికింది…
రాజు వెడ్స్ రాంబాయి
రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అయి చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది. సాయి కంపాటి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కట్టిపడేయడమే కాకుండా ఒక ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గా నిలిచిందనే చెప్పాలి…
శంభాల
రీసెంట్ గా రిలీజ్ అయిన శంభాల సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. యుగంధర్ ముని కథని చాలా అద్భుతంగా రాసుకొని దాన్ని స్క్రీన్ మీద చాలా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. అందువల్ల అతను దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడనే చెప్పాలి…
ఈ దర్శకులందరు మొదటి సినిమాతోనే వాళ్ళ సత్తాని చాటుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…