Tollywood: ఈ సంవత్సరం ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక అందులో భాగంగానే ఈ ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి క్రిస్మస్ పండగని పురస్కరించుకొని ఇప్పటికే సలార్ లాంటి భారీ సినిమా థియేటర్లోకి వచ్చి సందడి చేస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ వారం అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా సలార్ రికార్డులకు ఎక్కడమే కాకుండా ఈ సంవత్సరం కూడా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలవబోతుంది అంటూ చాలా రకాల వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇంకొక వారంలో ఈ ఇయర్ ముగుస్తున్న సందర్భంగా డిసెంబర్ 29వ తేదీన ఈ ఇయర్ లో చివరి సినిమాలుగా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అవి ఏ సినిమాలు అన్నవి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా అభిషేక్ నామా పోడ్యుసర్ గా చేస్తూనే దర్శకత్వం వహించిన డెవిల్ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ఒక పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. కళ్యాణ్ రామ్ అలాగే డైరెక్టర్ అయిన అభిషేక్ నామ ఇద్దరు కూడా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఇప్పటికే కళ్యాణ్ రామ్ సంయుక్త మీనన్ కాంబినేషన్ లో వచ్చిన బింబిసారా సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ కాంబినేషన్ కి ఆల్రెడీ హిట్ ట్రాక్ ఉంది కాబట్టి అది కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచుతుంది.నిజానికి ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో వచ్చి మంచి విజయాన్ని సాధించాలని చూస్తుంది…
ఇక ఈ సినిమాతో పాటుగా రాజీవ్ కనకాల, సుమ కనకాల కొడుకు అయిన రోషన్ కనకాల హీరోగా వస్తున్న బబుల్ గమ్ సినిమా కూడా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఈ ఇయర్ ఎండింగ్ లో వస్తున్న సినిమాగా మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ని చూసిన యూత్ ఇప్పటికే ఈ సినిమా మీద మంచి అంచనాలను పెట్టుకున్నారు.
ఇక వీటితో పాటు గా ఓటిటి లో మరి కొన్ని సినిమాలు, వెబ్ సీరీస్ లు కూడా రిలీజ్ అవుతున్నాయి…అవేంటో ఒకసారి చూద్దాం…
నెట్ ఫ్లిక్స్
హాలీవుడ్ కి చెందిన స్నాగ్ మూవీ ఈ నెల 25 వ తేదీన స్ట్రీమింగ్ కి రెఢీ అవుతుంది.
అలాగే ఖో గయే హమ్ కహా (హిందీ) మూవీ డిసెంబరు 26 తేదీన స్ట్రీమింగ్ కి రెఢీ అవుతుంది.
ఇక వీటితో పాటు గా లిటిల్ డిక్సీ (హాలీవుడ్) డిసెంబరు 28 వ తేదీన ప్రేక్షకులను అలరించడానికి రెఢీ అయింది.
ఇక తమిళ్ మూవీ అయిన
అన్నపూరణి కూడా డిసెంబరు 29 న రిలీజ్ అవుతుంది…
బెర్లిన్ అనే వెబ్‌సిరీస్ కూడా డిసెంబరు 29 న రిలీజ్ అవుతుంది.
శాస్త్రి అనే సినిమా డిసెంబరు 29 న రిలీజ్ అవుతుంది.
బీస్ట్ మూవీ కూడా డిసెంబరు 31 న రిలీజ్ అవుతుంది…
అమెజాన్ ప్రైమ్
ఇట్టూసీ బాత్ అనే హిందీ సినిమా డిసెంబరు 24 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది…
జీ5
డోనో అనే ఈ హిందీ మూవీ డిసెంబరు 29 న జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
సఫేద్ అనే హిందీ సినిమా డిసెంబరు 29 న స్ట్రీమింగ్ అవుతుంది.
వన్స్ అప్‌ఆన్ టూ టైమ్స్ కూడా డిసెంబరు 29 న స్ర్మింగ్ కి రెఢీ అయింది…
డిస్నీ+హాట్‌స్టార్
అజయ్ భూపతి డైరెక్షన్ లో పాయాల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో చేసిన మంగళవారం సినిమా గత నెల లో థియేటర్ లో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఇక దాంతో డిసెంబర్ 26 వ తేదీన ఈ సినిమా డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది…
12thఫెయిల్ అనే హిందీ మూవీ కూడా డిసెంబరు 29 న స్ట్రీమింగ్ అవుతుంది…
ఆహా
తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన కీడా కోలా డిసెంబరు 28 న స్ట్రీమింగ్ అవుతుంది…
లయన్స్ గేట్ ప్లే
ది కర్స్ అనే వెబ్ సిరీస్ డిసెంబరు 29 న రిలీజ్ కి రెడీ అవుతుంది…
జియో సినిమా
ఆస్టరాయిడ్ సిటీ అనే హాలీ వుడ్ మూవీ డిసెంబరు 25 న రిలీజ్ కి రెడీ అవుతుంది…