https://oktelugu.com/

Tollywood: 2021 ఇయర్ రౌండప్ : టాలీవుడ్ కి ఊపు తెచ్చిన సినిమాలివే !

Tollywood: కరోనా మహమ్మారి భయంతో మొదలైంది 2021. పైగా, ఈ ఏడాది బాక్సాఫీస్ రన్ కూడా చాలా త‌క్కువ. కానీ, మంచి విజయాలు వచ్చాయి. ఫ్లాపుల్లో ఉన్న స్టార్ హీరోలు హిట్ ట్రాక్ అందుకున్నారు. క్రాక్ టు పుష్ప వరకు చూసుకుంటే.. ఆ చిత్రాలేమిటో ఒక లుక్కేద్దాం. ‘క్రాక్‌’ : సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈ క్రాక్ మంచి విజయాన్ని సాధించింది. హీరో రవితేజ – గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో ‘డాన్ శీను’, ‘బలుపు’ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 27, 2021 / 10:17 AM IST
    Follow us on

    Tollywood: కరోనా మహమ్మారి భయంతో మొదలైంది 2021. పైగా, ఈ ఏడాది బాక్సాఫీస్ రన్ కూడా చాలా త‌క్కువ. కానీ, మంచి విజయాలు వచ్చాయి. ఫ్లాపుల్లో ఉన్న స్టార్ హీరోలు హిట్ ట్రాక్ అందుకున్నారు. క్రాక్ టు పుష్ప వరకు చూసుకుంటే.. ఆ చిత్రాలేమిటో ఒక లుక్కేద్దాం.

    Tollywood

    ‘క్రాక్‌’ :

    Krack

    సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈ క్రాక్ మంచి విజయాన్ని సాధించింది. హీరో రవితేజ – గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో ‘డాన్ శీను’, ‘బలుపు’ వంటి చిత్రాలు వచ్చాయి. మూడో సినిమాగా వచ్చిన క్రాక్ కూడా విజయం సాధించింది. తొలి రెండు చిత్రాలకు భిన్నంగా రవితేజను పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా దర్శకుడు తెరపై ప్రెజంట్‌ చేశారు. అలాగే క్రాక్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండటంతో సూపర్ హిట్ అయింది. కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయి.

    ‘నాంది’:

    Naandhi

    అల్లరి నరేష్ కి 2021లో వచ్చిన విజయం ఇది. ఫిబ్రవరిలో విడుదలైన ‘నాంది’ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. హిట్ లేక డీలా పడ్డ అల్లరి నరేశ్‌ కి ‘నాంది’ అంటూ మంచి హిట్ వచ్చింది. కామెడీ వదిలేసి సీరియస్ ఖైదీగా కనిపించిన నరేశ్‌, కొత్తగా ఆకట్టుకుంటూ మొత్తానికి తనలో ఇంకా మ్యాటర్ ఉందని నిరూపించుకున్నాడు.

    ‘సీటిమార్’:

    Seetimaarr

    లౌక్యం లాంటి సూపర్ హిట్ తర్వాత గోపీచంద్ కి మళ్ళీ ఆ స్థాయి విజయం రాలేదు. మధ్యలో ఎన్ని సినిమాలు చేసినా అన్నీ ప్లాప్ చిత్రాలుగానే మిగిలిపోయాయి. కానీ 2021లో సీటీమార్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు.

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్:

    most eligible bachelor

    2015లో కెరీర్ ప్రారంభించినా అఖిల్ ఖాతాలో సరైన విజయం పడలేదు. మిస్టర్ మజ్ను ఫస్ట్ హిట్ పేరు తెచ్చుకుంది.. కమర్షియల్ గా అది వర్కౌట్ కాలేదు. కానీ ఈ ఏడాది వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఈ అక్కినేని హీరోకి మంచి విజయాన్ని అధించింది.

    అఖండ :

    Akhanda

    ‘అఖండ’ సినిమా రిలీజ్ అయి నాలుగు వారాలు అవుతున్నా కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. నిజానికి కరోనా సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఊపు తెచ్చింది అఖండ ఒక్కటే. అఖండ నుంచే థియేటర్స్ దగ్గర జనం బారులు తీరారు. అసలు.. సినీ అభిమానులు.. ప్రముఖులు అఖండతో ఉత్సవాలు జరుపుకున్నారు. బాలయ్య తన మార్క్ యాక్షన్ తో బాక్సాఫీస్ ను కిచిడీ కిచిడీ చేసి పారేశాడు.

    పుష్ప :

    Pushpa

    ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించే కోణంలో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా.. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

    Tags