‘2018’ Movie collections : గత రెండేళ్ల నుండి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని చిన్న బడ్జెట్ సినిమాలు రూల్ చేస్తున్నాయి, గత ఏడాది విడుదలైన ‘కాంతారా’ చిత్రం కేవలం 10 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కి ప్రతీ భాషలో సూపర్ హిట్ గా నిలిచి ఏకంగా 450 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.అలాగే తమిళం లో విడుదలైన ‘లవ్ టుడే’ సినిమా కూడా కేవలం నాలుగు కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఈ ఏడాది కూడా ‘బలగం’ ,’బిచ్చగాడు 2 ‘ మరియు ‘విరూపాక్ష’ వంటి చిన్న బడ్జెట్ సినిమాలదే హవా.ఇప్పుడు రీసెంట్ గా కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి 2 వసూళ్లను సైతం దాటేసిన ‘2018’ అనే చిత్రం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. అతి తక్కువ బడ్జెట్ తో కేరళ లో గతం లో వచ్చిన వరదలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.
ఈ సినిమాని నిన్ననే తెలుగు లో కూడా ఘనంగా రీ రిలీజ్ చేసారు. ఈ చిత్రాన్ని ఇక్కడ గీత ఆర్ట్స్ సంస్థ విడుదల చేసింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్షన్ కి కేవలం రెండు కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. మొదటిరోజు కోటి రూపాయలకు పైగా గ్రాస్, మరియు 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిన ఈ సినిమా, రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది ట్రేడ్ పండితులు అంటున్నారు. రెండవ రోజు ఈ చిత్రానికి 75 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు.
అలా రెండు రోజులకు కలిపి కోటి 25 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే మలయాళం లో 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం, తెలుగు లో రోజు రోజుకి వసూళ్లు పెరగడం చూస్తుంటే, కాంతారా చిత్రం లాగ ఇది కూడా తెలుగు లో ప్రభంజనం సృష్టించబోతోందా అని అంటున్నారు ట్రేడ్ పండితులు.