Homeఎంటర్టైన్మెంట్Allu Arjun : 2000 కోట్ల హీరో అల్లు అర్జున్... పుష్ప 2 సక్సెస్ తో...

Allu Arjun : 2000 కోట్ల హీరో అల్లు అర్జున్… పుష్ప 2 సక్సెస్ తో ఐకాన్ స్టార్ లో వచ్చిన మార్పేంటో తెలుసా?

Allu Arjun : అల్లు అర్జున్ పేరు వింటే నార్త్ ఇండియా ఊగిపోతోంది. అంతగా పుష్ప సిరీస్ తో అల్లు అర్జున్ స్టార్డం రాబట్టాడు. పుష్ప కేవలం శాంపిల్. పుష్ప 2తో బాలీవుడ్ స్టార్స్ కి అల్లు అర్జున్ చుక్కలు చూపించాడు. అక్కడి బడా హీరోల రికార్డ్స్ కేవలం హిందీ వెర్షన్ తో లేపేశాడు. సౌత్ కి మించిన రెస్పాన్స్ పుష్ప 2కి నార్త్ లో దక్కడం కొసమెరుపు. వెయ్యి కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప 2 మూవీ.. ఏకంగా రూ. 2000 కోట్ల మార్క్ కి చేరువైంది. బాహుబలి 2 రికార్డు సైతం బద్దలు కొట్టింది. కేవలం అల్లు అర్జున్ ఫేమ్, స్టార్డం సినిమా బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించేలా చేసింది.

పుష్ప 2 సక్సెస్ తో అల్లు అర్జున్ రేంజ్ ఎవరూ ఊహించని స్థాయికి చేరింది. అదే సమయంలో అల్లు అర్జున్ ని వివాదాలు చుట్టుముట్టాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయ దుమారం రేపింది. అల్లు అర్జున్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశాడు. అల్లు అర్జున్ ని పరామర్శించిన ఇండస్ట్రీ ప్రముఖులపై సైతం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశాడు.

పుష్ప 2 విజయం సాధించడం తో అల్లు అర్జున్ సక్సెస్ కిక్ ఎక్కిందని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. కానీ అల్లు అర్జున్ తానెప్పుడూ ఒక సామాన్యుడు అనే భావనతోనే ఉంటారట. తానో పెద్ద స్టార్, సంథింగ్ స్పెషల్ అనే ఆలోచన తనకు ఉండదు అట. విరామ సమయం దొరికితే… ఖాళీగా ఉండిపోతారట. కనీసం పుస్తకం కూడా ముట్టుకోడట. విరామ సమయంలో విశ్రాంతి తీసుకోవడమే ఇష్టం అట. తనకు వచ్చిన సక్సెస్ ని బాధ్యతగా భావిస్తాడట. కాబట్టి పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ అయినప్పటికీ, అల్లు అర్జున్ లో ఎలాంటి మార్పు రాలేదట. ఆయన గతంలో మాదిరే ఉన్నారట.

నెక్స్ట్ అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నారు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular