This Week OTT Releases: మూవీ లవర్స్ కి సమ్మర్ బొనాంజా…ఓపెన్ హైమర్ తో పాటు ఓటీటీలో 20 సూపర్ హిట్ సినిమాలు!

సమ్మర్ వస్తుండగా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పలు సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తున్నాయి. నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా లో ఇరవైకి పైగా సినిమాలు త్వరలో ప్రసారం కానున్నాయి.

Written By: S Reddy, Updated On : March 18, 2024 3:39 pm

This Week OTT Releases

Follow us on

This Week OTT Releases: అంతకంతకు ఓటీటీ హవా ఎక్కువ అవుతుంది. మూవీ లవర్స్ ఏడాదికి వేల రూపాయలు వెచ్చించి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్నారు. ఇండియాలో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ తెలుగు, నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలు హవా కొనసాగిస్తున్నాయి. విభిన్నమైన కంటెంట్ చందాదారులకు అందిస్తున్నారు. సమ్మర్ వస్తుండగా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పలు సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తున్నాయి. నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా లో ఇరవైకి పైగా సినిమాలు త్వరలో ప్రసారం కానున్నాయి.

వీటిలో ఓపెన్ హైమర్ వంటి క్రేజీ మూవీ కూడా ఉంది. ఇటీవల ముగిసిన ఆస్కార్ వేడుకల్లో ఓపెన్ హైమర్ ఉత్తమ నటుడుతో పాటు పలు విభాగాల్లో ఆస్కార్ సొంతం చేసుకుంది. ఓపెన్ హైమర్ జియో సినిమాలో మార్చి 21 నుంచి స్ట్రీమ్ కానుంది. తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.

నెట్ ఫ్లిక్స్

మార్చి 18- యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ సినిమా)
మార్చి 21 – 3 బాడీ ప్రాబ్లమ్ (వెబ్ సిరీస్)
మార్చి 21- ఫైటర్ (హిందీ)
మార్చి 22- బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
మార్చి 22- షిర్లే (ఇంగ్లీష్ సినిమా)
మార్చి 22- ద కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్ సినిమా)
మార్చి 22- లాల్ సలామ్ (తమిళ/తెలుగు)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

మార్చి 20- అబ్రహం ఓజ్లర్ (తెలుగు)
మార్చి 20- సౌండ్ ల్యాండ్ : ద సిరీస్ (జపనీస్ సిరీస్)
మార్చి 22- ఎక్స్ – మ్యాన్ 97 (ఇంగ్లీష్ సిరీస్)
మార్చి 22- అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ సినిమా)
మార్చి 22- లూటేరా (హిందీ)2
మార్చి 22- డేవీ అండ్ జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ సిరీస్)
మార్చి 24- ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్

మార్చి 17- ప్లే గ్రౌండ్ (హిందీ సిరీస్)
మార్చి 19- మరక్కుమ నెంజాం (తమిళ)
మార్చి 21-ఏ వతన్ మేరే వతన్ (హిందీ)
మార్చి 21- రోడ్ హౌస్ (హాలీవుడ్)

ఈటీవీ విన్

మార్చి 22- సుందరం మాస్టర్

జియో సినిమా

మార్చి 21- ఓపెన్ హైమర్ (తెలుగు)

బుక్ మై షో

మార్చి 19- ప్రూయడ్స్ లాస్ట్ సెషన్

ఆపిల్ ప్లస్ టీవీ

మార్చి 20- పామ్ రాయల్(ఇంగ్లీష్ సిరీస్)
మార్చి 23- ఆర్లిల్లి (ఇంగ్లీష్ మూవీ)