OTT Releases : అంతకంతకూ ఓటీటీకి ఆదరణ పెరుగుతుంది. ప్రతివారం కొత్త చిత్రాలు, సిరీస్లు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. అందుకే ఒకరితో మరొకరు పోటీ పడి మరీ క్రేజీ కంటెంట్ సబ్స్క్రైబర్స్ కి అందిస్తున్నారు. ఈ శుక్రవారం సినిమాలు, వెబ్ సిరీస్లతో కలిపి మొత్తం 18 ప్రాజెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమ్ కానున్నాయి. గురువారం అర్ధరాత్రి నుండి ఇవి అందుబాటులోకి వచ్చాయి.
వీటిలో కొన్ని అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని స్ట్రీమ్ అవుతున్నాయి. కాగా కేవలం నాలుగు వారాల్లో రంగబలి ఓటీటీలోకి వచ్చేసింది. యంగ్ హీరో నాగ శౌర్య నటించిన రంగబలి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. జులై 7న విడుదలైన రంగబలి ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాబట్టి రంగబలి నెట్ఫ్లిక్స్ లో చూసేయొచ్చు.
ఇక చక్రవర్తి, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలు చేసిన దయ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. దయ క్రైమ్ థ్రిల్లర్. ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు పెరిగాయి. చక్రవర్తి రోల్ మిస్ట్రీరియస్ గా ఉంది. దయ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తిరువీర్ హీరోగా నటించిన పరేషాన్ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. వాటితో పాటు వివిధ భాషల చిత్రాలు, సిరీస్లు అందుబాటులో రానున్నాయి. అవేమీ చూద్దాం..
ఆహా
హైవే – తమిళ సినిమా
సైనా ప్లే
డార్క్ షేడ్స్ ఆఫ్ సీక్రెట్ – మలయాళ సినిమా
అమెజాన్ ప్రైమ్
ద లాస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ ఎలైస్ హర్ట్ – ఇంగ్లీష్ సిరీస్
హాట్‌స్టార్
దయ – తెలుగు వెబ్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్
ఫేటల్ సెడక్షన్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్
రంగబలి – తెలుగు సినిమా
ద బిగ్ నైల్డ్ ఇట్ బేకింగ్ ఛాలెంజ్ – ఇంగ్లీష్ సిరీస్
ద హంట్ ఫర్ వీరప్పన్ – హిందీ సిరీస్
చూనా – హిందీ సిరీస్
హెడ్ టూ హెడ్ – అరబిక్ సినిమా
హార్ట్ స్టాపర్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్
ద లాస్ట్ అవర్స్ ఆఫ్ మారియో బ్యూయోండో – స్పానిష్ సిరీస్
ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 2 – ఇంగ్లీష్ సిరీస్
సోనీ లివ్
ఫటాఫటీ – బెంగాలీ మూవీ
పరేషాన్ – తెలుగు సినిమా
బుక్ మై షో
లాస్ట్ & ఫౌండ్ – ఇంగ్లీష్ చిత్రం
సైలెంట్ హవర్స్ – ఇంగ్లీష్ మూవీ
టూ క్యాచ్ కిల్లర్ – ఇంగ్లీష్ సినిమా