Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న చిత్రాల్లో అభిమానులు, ప్రేక్షకులు చాలా కాలం నుండి ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. లాక్ డౌన్ కి ముందు క్రిష్ దర్శకత్వం మొదలైన సినిమా ఇది. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా కాలం వరకు షూటింగ్స్ వాయిదా పడడం, ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్ సినిమాలు చేయడం, మళ్ళీ ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల షూటింగ్ మరింత వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఎన్నో అవరోధాలను దాటుకొని ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది మార్చి 28వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషనల్ కంటెంట్ ని విడుదల చేయడం మొదలు పెట్టింది మూవీ టీం. నేడు ఈ సినిమాకి సంబంధించిన ‘మాట వినాలి’ సాంగ్ ని 5 భాషల్లో విడుదల చేసారు.
రెస్పాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. కేవలం 5 గంటల్లోనే తెలుగు వెర్షన్ లో 11 మిలియన్ వ్యూస్, 2 లక్షల 30 వేల లైక్స్ వచ్చాయి. హిందీ వెర్షన్ లో దాదాపుగా 6 మిలియన్ వ్యూస్, ఓవరాల్ గా అన్ని భాషలకు కలిపి 17 మిలియన్ కి పైగా వ్యూస్, 2 లక్షల 50 వేల లైక్స్ ని సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ లో ఈ పాటకి వస్తున్న వ్యూస్ ని చూస్తుంటే కచ్చితంగా ఆల్ టైం రికార్డు పెట్టెలాగానే అనిపిస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ లోని ‘కిస్సిక్’ పాటకు 24 గంటల్లో 27 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఆ రికార్డు ని కొట్టే దిశగా దూసుకుపోతుంది. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ బిట్ సాంగ్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే, సినిమాలోని ముఖ్యమైన పాటలకు ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు.
ఈ పాటలో ఎలాంటి ట్యూనింగ్ ప్రోగ్రామింగ్ లేకుండా పవన్ కళ్యాణ్ ఎలా అయితే పాడాడో, అలాగే పెట్టేసారు. తెలుగు వెర్షన్ కంటే ఎక్కువగా మలయాళం, హిందీ వెర్షన్ లో బంపర్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎలాంటి తప్పు లేకుండా, ఇంత అనర్గళంగా ఎలా పాడగలిగాడు అంటూ ఆ భాషలకు చెందిన ప్రేక్షకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి నుండి ఇంతే. ఏ బాషా అయినా తన మాతృ బాషాని ఎలా అయితే అనర్గళంగా మాట్లాడుతాడో, అంతే అనర్గళంగా ఇతర భాషలను కూడా మాట్లాడుతాడు. తెలంగాణ యాస, రాయలసీమ యాస, శ్రీకాకుళం యాస, నెల్లూరు యాస, ఇలా ఏ యాస అయినా అనర్గళంగా మాట్లాడడం పవన్ కళ్యాణ్ కి కొట్టిన పిండి లాంటిది. ఈ పాత మరోసారి ఆ విషయాన్నీ నిరూపించింది.