
Bigg Boss 5 Telugu : నాగార్జున.. ఆయన వయసు అరవై అని తెలిసినా నమ్మబుద్ధికాదు! అంతలా ఫిజికల్ ఫిట్ నెస్ మెయింటెయిన్ చేస్తున్నారు టాలీవుడ్ మన్మథుడు. ఇక, తనదైన హోస్టింగ్ తో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ ను అద్భుతంగా రన్ చేసిన నాగ్.. ఆ తర్వాత బిగ్ బాస్ షోను కూడా గత మూడు సీజన్లుగా సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేస్తున్నారు. తనదైన వాక్ఛాతుర్యంతో అటు కంటిస్టెంట్లను, ఇటు ఆడియన్స్ ను అలరిస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు సీజన్లకు హోస్ట్ గా ఉన్నప్పటికీ.. ఎక్కడా రిమార్కు రాలేదు. అయినప్పటికీ.. నాగ్ కు రెస్ట్ ఇస్తే బాగుంటుందని సూచనలు చేస్తుండడం గమనార్హం.
తెలుగు బిగ్ బాస్ షో మొదటి సీజన్ 2017లో మొదలైంది. అయితే.. ఆరంభం వరకూ అందరిలో ఒక సందేహం ఉండేది. ఈ షో తెలుగులో సక్సెస్ అవుతుందా? ఆడియన్స్ ఓన్ చేసుకుంటారా? అనే టెన్షన్ నిర్వాహకుల్లో ఉండేది. కానీ.. ఫస్ట్ సీజన్ అద్దిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. ఈ సక్సెస్ కు.. కంటిస్టెంట్స్ ఫేమ్ ఒకెత్తయితే.. హోస్టు కూడా మరోకారణం. నటుడిగా తానేంటో నిరూపించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్.. హోస్టుగా ఎలా చేస్తాడా? అనే ఆసక్తి అందరిలోనూ ఉండింది. వారి అంచనాలను మించి వ్యాఖ్యాతగా సక్సెస్ అయ్యారు జూనియర్.
అయితే.. సెకండ్ సీజన్ కు అనివార్య కారణాలతో జూనియర్ వైదొలిగాడు. ఆ ప్లేసును నాని భర్తీ చేశాడు. నాని కూడా తనదైన రీతిలో షోను సక్సెస్ ఫుల్ గానే ముగించాడు. ఆ తర్వాత అతను కూడా తప్పుకున్నాడు. ఇక, అప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు విజయవంతంగా రన్ చేసి ఉన్న నాగ్.. బిగ్ బాస్ బాధ్యతలు చేపట్టారు. ఒకటీ, రెండు, మూడు అంటూ అద్భుతంగా బిగ్ బాస్ షోను రన్ చేశాడు. బిగ్ బాస్ షోకు హయ్యెస్ట్ రేటింగ్ 18 పైగా వచ్చింది నాగార్జున ఆధ్వర్యంలోనే. అందుకే.. ఐదో సీజన్ బాధ్యతలు కూడా నాగార్జున చేతిలోనే పెట్టారు నిర్వాహకులు.
ఐదో సీజన్ రెండు రోజుల క్రితం ఘనంగా ప్రారంభమైంది. ఎప్పటిలాగనే షోను తనదైన రీతిలో అద్భుతంగా ఓపెన్ చేశాడు నాగ్. ఫుల్ ఎనర్జీతో.. స్పీడ్ పెంచి, తనదైన ట్రేడ్ మార్క్ తో బిగ్ బాస్ ను నడిపిస్తున్నారు. అయితే.. కొందరు అభిమానులు మాత్రం బిగ్ బాస్ షోకు మళ్లీ జూనియర్ ను తీసుకురావాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుండడం గమనార్హం. వచ్చే బిగ్ బాస్ సీజన్ 6లోగానీ.. లేదంటే కనీసం బిగ్ బాస్ 10లోగానీ జూనియర్ ను హోస్టుగా చూడాలని కోరుకుంటున్నామని చెప్పడం గమనార్హం.
We want NTR as a host For BB Series Next Time.. BB6 or atleast BB10 in 2026…#BiggBossTelugu5 pic.twitter.com/6qZQsvpVro
— Anand (@AnandCTweets) September 5, 2021