
వివాదాస్పద కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి మరోసారి సంచలన కామెంట్లు చేసింది. ఈసారి ఆమె తన తోటి హీరోయిన్లనే టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. హీరోయిన్లకు కేవలం డబ్బున్నోళ్లే పెళ్లి చేసుకుంటారని అలాంటి వారిని చూసి మహిళలు స్ఫూర్తిగా తీసుకోవద్దని సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
గతంలో శ్రీరెడ్డి నిర్మాత సురేష్ బాబు కొడుకు తనను లైగికంగా వాడుకొని వదిలేశాడని ఆరోపించి సంచలనం సృష్టించింది. అలాగే కాస్టింగ్ కౌచ్ పేరిట టాలీవుడ్లో బడా దర్శక, నిర్మాతలను టార్గెట్ చేసింది. ఆ తర్వాత మా మూవీ అసోసియేషన్ ఎదుట అర్ధనగ్నం నిరసన తెలిపి అనుహ్యంగా ప్లాపులర్ అయింది. ఆ తర్వాత చైన్నెకి వెళ్లి సోషల్ మీడియాలో టాలీవుడ్, కోలివుడ్ స్టార్లపై వివాదస్పద వ్యాఖలు చేస్తూ వార్తల్లో నిలిస్తుంది. ఇటీవల యూట్యూబ్లో వంటల ప్రొగ్రాం స్టాట్ చేసిన శ్రీరెడ్డి తాజాగా హీరోయిన్లను టార్గెట్ చేయడం ఆసక్తిని రేపుతోంది.
నేటితరం హీరోయిన్లు డబ్బున్నోళ్లనే పెళ్లి చేసుకుంటారని.. వాళ్లది స్వార్థపూరిత ధోరణి అని, వారిని మహిళలు స్ఫూర్తిగా తీసుకోవద్దంటూ వరుస పోస్టులు పెట్టింది. ఈ కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. నీవ్వు మాత్రం పేదోడిని పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం శ్రీరెడ్డి చెప్పింది వాస్తమేనని.. ప్రస్తుత సమాజంలో మహిళలు అలాగే ఆలోచిస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి హీరోయిన్లను, శ్రీరెడ్డిని సపోర్టు చేస్తున్నారు. మహిళలు మాత్రం శ్రీరెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.