మూడుతరాలుగా ‘అక్కినేని’ ఫ్యామిలీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగు సినిమా హైదరాబాద్ రావడానికి అక్కినేని నాగేశ్వర్ రావు ప్రధాన కారణమని అందరికీ తెల్సిందే. నాగేశ్వర్ రావు ప్రేమ కథలు, పౌరణిక, జానపద తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ‘దేవదాసు2, ప్రేమనగర్ వంటి ప్రేమకథలతో అప్పట్లో ఇండస్ట్రీ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత నాగార్జున ఆయన వారసత్వం కొనసాగించారు. ప్రస్తుతం నాగేశ్వర్ రావు మనువడు నాగచైతన్య వరుస ప్రేమకథలు చేస్తూ తాతకు తగ్గ మనువడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. తాజాగా నాగచైతన్య ‘నాగేశ్వర్ రావు’ అనే సినిమాలో నటించున్నారని ప్రచారం జరుగుతుంది. ‘నాగేశ్వర్ రావు’ టైటిల్ ఇప్పటికే ఫిల్మ్ చాంబర్లో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని 14రీల్స్ సంస్థ నిర్మించనుంది.
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ మూవీని తెరక్కిస్తున్నాడు. ఈ మూవీలో నాగాచైతన్యకు జోడీగా ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటిస్తుంది. సంక్రాంతి రోజున ‘లవ్ స్టోరీ’కి సంబంధించిన ఫస్టు లుక్, టైటిల్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల గత సినిమాల మాదిరిగానే మంచి ఫీల్ తో సినిమా థియేటర్ల నుంచి బయటికి వెళ్లెలా ‘లవ్ స్టోరీ’ తెరకెక్కనుందని తెలుస్తోంది. ‘ఫిదా, హ్యపీడేస్, ఆనంద్ తరహాలోనే రొమాంటిక్ ‘లవ్ స్టోరీ’ ఉంటుందని తెలుస్తోంది. నాగచైతన్య, సాయిపల్లవి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
ఇప్పటికే సాయిపల్లవి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసింది. శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్లకు మంచి పాత్ర ఉంటుంది. ఉత్తమ నటన కనబర్చే సాయిపల్లవి ఈ సినిమాలో నాగ చైతన్య నటిస్తుండటంతో ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేమకథ చిత్రాల్లో నాగచైతన్య ఇప్పటికే భారీ సక్సస్ అందుకున్న సంగతి తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్లలో తొలిసారి మూవీ వస్తుండటంతో సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.