ఈ విషయం గురించే జగతిపై అరుస్తాడు. నీ కడుపున పుట్టడమే నా పాపం అంటూ జగతిని బాధపెట్టే మాటలతో బాగా తిడుతుంటాడు. కాలేజీలో మీ మధ్య ఉన్న సంబంధం గురించి ఎవరికి తెలియదు మీరే కావాలని బయటపడేలా చేస్తున్నారు ఇది కాలేజ్ ఆ లేక పార్క్ ఆ అంటూ జగతిపై అరుస్తాడు. అంతలోనే మహేంద్రవర్మ వచ్చి రిషిపై కోపంతో గట్టిగా అరుస్తాడు. రిషి సైలెంట్ గా ఉండిపోతాడు. మహేంద్ర వర్మ జగతి గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు. ఇక జగతి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది.
మహేంద్ర వర్మ రిషి గట్టిగా హెచ్చరించి అక్కడ్నుంచి జగతి దగ్గరికి వెళ్తాడు. ఇక జగతి ఇంటికి వెళదామని కాసేపు ఒంటరిగా వదలమని మహేంద్ర ను కోరుకోవడంతో.. మహేంద్ర నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ జగతిని ఇంటికి తీసుకెళ్తాడు. ఇక మరోవైపు వసు దేవయాని మాటలను తలుచుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది. దేవయాని జగతి మేడమ్, రిషి సార్ లను ఇంకా విడగొడుతుంది అంటూ బాధపడుతుంది. తను గురు దక్షిణ కోసం గతంలో మహేంద్రవర్మ సార్ కు ఇచ్చిన మాటను తలుచుకొని ఎలాగైనా రిషి సార్ లను కలపాలి అని ఫిక్స్ అవుతుంది. అంతలోనే తన పక్కనుండి ఒక కారు పోవడంతో అక్కడున్న బురద తనపై పడుతుంది.
కాలేజీకి వచ్చి రిషితో ప్రాజెక్టు వర్క్ చూడమని చెప్పగా రిషి అప్పటికే తన తండ్రి ఆమె వల్ల తనను తిట్టాడు అనుకొని రగిలిపోతాడు. వసు పై కోపం చూపిస్తూ తన చేతిలో ఉన్న ఫైల్స్ కింద పడేస్తాడు. ఇక వసు భయపడుతూ ఫైల్స్ తీసుకొని వెళ్ళి పోతుంది. ఇక తరువాయి భాగంలో ఆటోల వెళ్తున్న వసును ఎదుర్కొని వసును తనతో రమ్మని పిలుస్తాడు. వసు కోపంగా రాను అంటూ బదిలీ ఇవ్వడంతో నేనే వస్తాను అంటూ ఆటోలో ఎక్కి కూర్చుంటాడు. వసు ఆటో దిగి రండి సార్ అంటూ పిలుస్తుంది.