https://oktelugu.com/

Seetimaar Telugu Movie Review : ‘సీటీ మార్’ రివ్యూ

Seetimaar Telugu Movie Review: నటీనటులుః గోపీచంద్, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, రావు ర‌మేష్‌, పోసాని, త‌దిత‌రులు నిర్మాణంః శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్‌ సంగీతంః మ‌ణిశ‌ర్మ‌ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంః సంప‌త్ నంది రిలీజ్ః 10-09-2021 Seetimaar Review : మాచో స్టార్ గోపీ చంద్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాల‌మైంది. హీరోయిన్ త‌మ‌న్నా కూడా స‌క్సెస్ టేస్ట్ చేయ‌డానికి చాలా రోజులుగా వెయిట్ చేస్తోంది. ఇక‌, ద‌ర్శ‌కుడు సంపత్ నంది […]

Written By:
  • Rocky
  • , Updated On : September 10, 2021 / 04:19 PM IST
    Follow us on

    Seetimaar Telugu Movie Review: నటీనటులుః గోపీచంద్, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, రావు ర‌మేష్‌, పోసాని, త‌దిత‌రులు
    నిర్మాణంః శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్‌
    సంగీతంః మ‌ణిశ‌ర్మ‌
    క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంః సంప‌త్ నంది
    రిలీజ్ః 10-09-2021

    Seetimaar Review : మాచో స్టార్ గోపీ చంద్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాల‌మైంది. హీరోయిన్ త‌మ‌న్నా కూడా స‌క్సెస్ టేస్ట్ చేయ‌డానికి చాలా రోజులుగా వెయిట్ చేస్తోంది. ఇక‌, ద‌ర్శ‌కుడు సంపత్ నంది ప‌రిస్థితి కూడా ఇంతే. ఈ ముగ్గురికీ అర్జెంటుగా ఒక హిట్ కావాలి. ఇలాంటి స‌మ‌యంలో థియేట‌ర్లో ప్రేక్ష‌కుల‌తో సీటీ కొట్టించేందుకు ‘సీటీ మార్’ అంటూ వ‌చ్చేశారు. మరి, థియేటర్లో ఈల వేయించారా? ఈ చిత్రానికి ఎన్ని పాయంట్లు వ‌చ్చాయి? ఫైనల్ గా కప్పుకొట్టారా లేదా? అన్న‌ది చూద్దాం.

    క‌థః హీరో గోపీ చంద్ ఆంధ్రా క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్‌. త‌న తండ్రి స్థాపించిన స్కూల్ మూత‌ప‌డే ప‌రిస్థితి రావ‌డంతో.. దాన్ని నిల‌బెట్టాల‌నుకుంటాడు. క‌బ‌డ్డీ జ‌ట్టును జాతీయ‌స్థాయి పోటీల‌కు తీసుకెళ్లి, గెలిపించ‌డం ద్వారా.. పాఠ‌శాల‌ స‌మ‌స్య‌ను అంద‌రికీ తెలియ‌జేయాల‌ని భావిస్తాడు. అయితే.. అత‌ని ప్ర‌య‌త్నాల‌కు ఊళ్లోనే ప‌లు అడ్డంకులు ఎదుర‌వుతాయి. వాటిని అధిగ‌మించి ఢిల్లీ చేరినా.. అక్క‌డ‌ మాఫియాతో వివాదం ఏర్ప‌డుతుంది. వీటిని ఎలా అధిగ‌మించాడు? తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా ఉన్న తమన్నా.. అతనికి ఎలా అండ‌గా నిలిచింది? అన్న‌ది క‌థ‌.

    క‌థ‌నంః క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో క‌థ చాలా వ‌ర‌కు క్లైమాక్స్ కు ముందే తెలిసిపోతుంది. కాబ‌ట్టి దృష్టి పెట్టాల్సింది క‌థ‌నం మీద‌నే. ఎలాంటి స‌న్నివేశాలు రాసుకుంటారు? అందులో ఎలాంటి ట్విస్టులు ఉంటాయి? అన్న‌దానిపైనే ప్రేక్ష‌కులు అందులో ఇన్వాల్వ్ అవుతారు. సీటీ మార్ కూడా ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా. దానికి క‌బ‌డ్డీని జోడించి క‌ప్పు కొట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడు దర్శ‌కుడు సంప‌త్ నంది. తొలి భాగం కామెడీ ట‌చ్ తో లాగించేసి.. సెకండ్ హాఫ్ ను పూర్తిగా సీరియ‌స్ మోడ్ లోకి తీసుకెళ్లాడు. గ్రామాల్లో అమ్మాయిల‌కు ఎలాంటి ఆంక్ష‌లు ఉంటాయో తెలిసిందే. అలాంటి వారిని ఢిల్లీ దాకా తీసుకెళ్లేందుకు గోపీచంద్ చేసే ప్ర‌య‌త్నాలు ఆక‌ట్టుకుంటాయి. గ్రామీణ వాతావ‌ర‌ణం ఊరి రాజ‌కీయాలు, కామెడీ స‌న్నివేశాలు అల‌రిస్తాయి.

    సెకండ్ హాఫ్ కు వ‌చ్చే స‌రికి పూర్తిగా యాక్ష‌న్ వైపు న‌డిపించాడు. అయితే.. పోలీసు ఆఫీస‌ర్ గా ఉంటూనే మాఫియాను న‌డిపిస్తున్న మాక‌న్ సింగ్ తో.. హీరో పోరాటం సాగించే విధానం వాస్త‌విక‌త‌కు దూరంగా ఉంటుంది. నేష‌న‌ల్ గేమ్స్ లో పాల్గొన‌డానికి వెళ్లిన‌ ఒక టీమ్ మొత్తాన్ని ఎవ‌రో కిడ్నాప్ చేస్తే.. వారిని వెతికేందుకు కోచ్ మాత్ర‌మే ప్ర‌య‌త్నించ‌డం లాజిక‌ల్ గా అనిపించ‌దు. హీరో, విల‌న్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌ను మ‌రింత ఉత్కంఠ‌గా తెర‌కెక్కిస్తే బాగుండు అనిపిస్తుంది. క‌బ‌డ్డీ ఫైన‌ల్ మాత్రం ఆక‌ట్టుకుంటుంది.

    పెర్ఫార్మెన్స్ః కోచ్ గా గోపీచంద్ స‌రిగ్గా స‌రిపోయాడు. తన‌కు అల‌వాటైన యాక్ష‌న్ లో దుమ్ములేపారు. అయితే.. హీరోయిన్ తో కెమిస్ట్రీ లేక‌పోవ‌డం వెలితిగా అనిపిస్తుంది. జ్వాలా రెడ్డిగా తెలంగాణ యాస‌లో న‌వ్విస్తుంది. రావు ర‌మేష్ గ్రామ‌ ప్రెసిడెంట్ గా ఆక‌ట్టుకున్నాడు. ఆయ‌న డైలాగులు ఆక‌ట్టుకుంటాయి. భూమిక పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేద‌నే చెప్పాలి. పోసాని, రెహ్మాన్ త‌దిత‌రులు ప‌రిధిమేర న‌టించారు. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్‌, ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు కూడా ప‌ర్వాలేదు. అయితే.. క‌థ ఎలాగో తెలిసిందే కాబ‌ట్టి, క‌థ‌నంపై ద‌ర్శ‌కుడు మ‌రింత వ‌ర్క్ చేస్తే బాగుండేది.

    బ‌లాలుః గోపీచంద్‌, ఫ‌స్ట్ హాఫ్‌, కొన్ని స‌న్నివేశాలు

    బ‌ల‌హీన‌త‌లుః క‌థ‌, క‌థ‌నం, రొటీన్ స‌న్నివేశాలు

    లాస్ట్ లైన్ః ‘సీటీ’ సరిగా మోగ‌లే

    రేటింగ్ః 2\5