Jobs: విజయవాడ ఈఎస్‌ఐసీ ఆఫీసులో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.80 వేల వేతనంతో?

Jobs: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తోంది. తాజాగా విజయవాడలో ఉన్న ఈఎస్‌ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 35 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ)–07, స్టెనోగ్రాఫర్‌–02, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌)–26 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. […]

Written By: Kusuma Aggunna, Updated On : January 5, 2022 9:03 am
Follow us on

Jobs: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తోంది. తాజాగా విజయవాడలో ఉన్న ఈఎస్‌ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 35 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం.

అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ)–07, స్టెనోగ్రాఫర్‌–02, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌)–26 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. పదో తరగతి/తత్సమాన, స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఇంటర్మీడియట్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. యూడీసీ, స్టెనో పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాలు, ఎంటీఎస్‌ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హులు.

ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు మొదట షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు తుది ఎంపిక ప్రక్రియ జరగనుంది. యూడీసీ, స్టెనో పోస్టులకు పే లెవెల్ 4 ప్రకారం రూ.25,500 నుంచి రూ.81,100 వరకు వేతనం లభిస్తుంది. ఎంటీఎస్‌ పోస్టులకు పే లెవల్‌–1 ప్రకారం 18,800 నుంచి రూ.56,900 వరకు వేతనం లభిస్తుంది.

ఈ నెల 15వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. నిరుద్యోగులకు వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల ప్రయోజనం చేకూరనుంది.