UPSC CSE 2022 Result : 2022 సంవత్సరానికి గాను సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో తెలంగాణ విద్యార్థిని ఉమా హారతి అఖిల భారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం జరిగింది. దీంతో ఆమె కలలు నెరవేరాయి. కలెక్టర్ కావాలనే ఆమె వాంఛ ఎట్టకేలకు తీరింది. కష్టపడితే ఫలితాలు వస్తాయనే తెలుసు. కానీ దేశంలోనే మూడో ర్యాంకు సాధించడంతో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె తండ్రి వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె సోదరుడు కూడా గత ఏడాది జాతీయ స్థాయి ఇంజినీరింగ్ లో 12వ ర్యాంకు సాధించారు. ఇలా ఒకే ఇంట్లో ఇద్దరు సరస్వతీ పిల్లలు ఉండటం గమనార్హం. ఆమె దేశంలోనే మూడో ర్యాంకు సాధించడం పల్ల పలువురు ప్రశంసిస్తున్నారు. మన రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని చెబుతున్నారు.
మంగళవారం వెలువడిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఉమ మూడో ర్యాంకు సాధించడంపై సంబరాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి స్వస్థలం సూర్యపేట జిల్లాలోని హుజుర్ నగర్. ఉద్యోగరీత్యా వీరి కుటుంబం నారాయణపేటలో ఉంటోంది. తండ్రికి తగ్గ పిల్లలు అనిపించుకుంటున్నారు. ఇద్దరు కూడా మంచి స్థాయికి ఎదగడం నిజంగా గర్వకారణమనే అంటున్నారు.
ఉమ విజయం కొత్తవారికి స్ఫూర్తినిస్తోంది. జాతీయ స్థాయిలో అంత పెద్ద ర్యాంకు సాధించడం నిజంగా గొప్పవరమనే చెప్పాలి. దేశంలో ఎంతో మంది పోటీలో ఉండగా ఉమ తన ర్యాంకు మూడో స్థానం సంపాదించడంపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ లో ఆమె మన ప్రాంతంలోనే కలెక్టర్ గా విధులు నిర్వహించాలని కోరుకుంటున్నారు.