https://oktelugu.com/

Jobs: తెలంగాణలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. రూ.60 వేల వేతనంతో..?

తెలంగాణ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పలు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలోని కేంద్రాల్లో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 40 ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 16, 2021 / 11:18 AM IST
    Follow us on

    తెలంగాణ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పలు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలోని కేంద్రాల్లో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 40 ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుంది. స్టాఫ్‌నర్స్‌, కేర్‌ కోఆర్టినేటర్‌, న్యూటిషనిస్ట్‌, రీసెర్చ్‌ ఫెలో, మెడికల్‌ ఆఫీసర్‌, కౌన్సెలర్‌, ఫార్మసిస్ట్‌, ఇతర ఉద్యోగ ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్‌, పీఎల్‌హెచ్‌ఐవీ మాస్టర్స్‌ డిగ్రీ, ఎండీ, ఇంటర్మీడియట్‌, బీఎస్సీ (నర్సింగ్‌), జీఎన్‌ఎం, ఎంబీబీఎస్‌ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు 9,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వేతనం లభిస్తుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. జిల్లా కేంద్రాల్లోని మెడికల్‌ సూపరింటెండెట్‌, డైరెక్టర్ కార్యాలయాల్లో దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది.

    ఏఆర్‌టీసీ, సీఓఈ, పీసీఓఈ, ఎల్‌ఏసీ, ఓఎస్‌టీ కేంద్రాలలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులు పని చేయాల్సి ఉంటుంది. https://tsacs.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.