Jobs: హైదరాబాద్ లో ఉద్యోగ ఖాళీలు.. రూ.23,000 వేతనంతో..?

హైదరాబాద్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 96 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. ఆగస్టు 16వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. మొత్తం 96 ఉద్యోగ ఖాళీలలో బస్తీ దవాఖానా ఉద్యోగ ఖాళీలు 22, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ ఖాళీలు 24, ఎన్‌సీయూ/ఎన్‌బీఎన్‌యూ ఉద్యోగ ఖాళీలు […]

Written By: Navya, Updated On : August 16, 2021 8:30 am
Follow us on


హైదరాబాద్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 96 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. ఆగస్టు 16వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. మొత్తం 96 ఉద్యోగ ఖాళీలలో బస్తీ దవాఖానా ఉద్యోగ ఖాళీలు 22, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ ఖాళీలు 24, ఎన్‌సీయూ/ఎన్‌బీఎన్‌యూ ఉద్యోగ ఖాళీలు 50 ఉన్నాయి.

బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎం పాస్ కావడంతో పాటు నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిష్టర్ అయిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021, ఆగస్టు 1 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 23,000 రూపాయల వేతనం చెల్లిస్తారు. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ను బట్టి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం ఆగష్టు 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://hyderabad.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.

ఆసక్తి ఉన్నవాళ్లు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు భారీగా పోటీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.