https://oktelugu.com/

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. పరీక్ష పేపర్ల సంఖ్య కుదింపు..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఈ సంవత్సరం అన్ని రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇతర రంగాలతో పోల్చి చూస్తే శరవేగంగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణ విద్యార్థులతో పోలిస్తే పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులపై వైరస్ ప్రభావం ఎక్కువగా పడింది. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఒత్తిడిని తగ్గించడానికి తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. Also Read: విద్యార్థులకు శుభవార్త.. పది […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 8, 2020 / 06:36 PM IST
    Follow us on


    కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఈ సంవత్సరం అన్ని రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇతర రంగాలతో పోల్చి చూస్తే శరవేగంగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణ విద్యార్థులతో పోలిస్తే పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులపై వైరస్ ప్రభావం ఎక్కువగా పడింది. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఒత్తిడిని తగ్గించడానికి తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

    Also Read: విద్యార్థులకు శుభవార్త.. పది రోజులు నో స్కూల్ బ్యాగ్ డే..!

    గతంతో పోలిస్తే సిలబస్ ను తగ్గించిన విద్యాశాఖ పరీక్షా పేపర్లను కూడా కుదించాలని భావిస్తోందని సమాచారం. విద్యాశాఖ అధికారులు పదో తరగతి విద్యార్థులకు 11 పరీక్ష పేపర్లు ఉండగా వాటి సంఖ్యను ఆరుకు తగ్గించాలని భావిస్తున్నారని సమాచారం. ఫలితంగా ఈ సంవత్సరం ఒక సబ్జెక్ట్ కు ఒకే పేపర్ చొప్పున పరీక్షలు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పరీక్షా సమయాన్ని కూడా కుదించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్యూ ద్వారా సెయిల్‌‌ లో ఉద్యోగాలు..?

    విద్యాశాఖ గతంతో పోలిస్తే విద్యార్థులకు ఛాయిస్ లను పెంచాలని.. అలా చేయడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. త్వరలో విద్యాశాఖ అధికారులు ఈ అంశం గురించి సీఎం కేసీఆర్ తో చర్చించనున్నారని తెలుస్తోంది.

    మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

    విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పరిస్థితులు మారే అవకాశం ఉందని.. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు సాధారణంగా నిర్వహించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.