https://oktelugu.com/

పాన్ కార్డును వాడటం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా..?

మనకు ఎంతో అవసరమైన కార్డులలో పాన్ కార్డ్ ఒకటనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఎంత ముఖ్యమో పాన్ కార్డ్ కూడా అంటే ముఖ్యమని చెప్పవచ్చు. పాన్ కార్డును కలిగి ఉండటం ద్వారా ఎన్నో ముఖ్యమైన లావాదేవీలను జరిపే అవకాశం ఉంటుంది. వస్తువుల క్రయవిక్రయాల విషయంలో ఒక లావాదేవీ విలువ 2 లక్షల రూపాయలు దాటితే పాన్ కార్డ్ నంబర్ కచ్చితంగా ఇవ్వాలి. 10 లక్షల రూపాయల కంటే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 5, 2021 / 03:57 PM IST
    Follow us on

    మనకు ఎంతో అవసరమైన కార్డులలో పాన్ కార్డ్ ఒకటనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఎంత ముఖ్యమో పాన్ కార్డ్ కూడా అంటే ముఖ్యమని చెప్పవచ్చు. పాన్ కార్డును కలిగి ఉండటం ద్వారా ఎన్నో ముఖ్యమైన లావాదేవీలను జరిపే అవకాశం ఉంటుంది. వస్తువుల క్రయవిక్రయాల విషయంలో ఒక లావాదేవీ విలువ 2 లక్షల రూపాయలు దాటితే పాన్ కార్డ్ నంబర్ కచ్చితంగా ఇవ్వాలి.

    10 లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువ ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేయాలంటే పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. షేర్లు కాకుండా ఇతర సెక్యూరిటీస్ కొనుగోలు చేసే సమయంలో లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తం విలువ ఉన్న లావాదేవీలకు పాన్ కార్డు కచ్చితంగా అవసరం. సంవత్సరంలో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉంటే పాన్ కార్డును కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది.

    ఒకరోజులో 50,000 రూపాయల కంటే ఎక్కువ విలువ ఉన్న లావాదేవీని నిర్వహిస్తే పాన్ కార్డ్ కచ్చితంగా కావాలి. బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థలలో డబ్బులు డిపాజిట్ చేస్తే పాన్ కార్డును కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్బీఐ బాండ్లను కొనుగోలు చేసే సమయంలో 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం లావాదేవీలకు పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. కంపెనీ డిబెంచర్లు లేదా బాండ్ల కొనుగోలుకు 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాలి.

    మ్యూచువల్ ఫండ్స్‌లో 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే పాన్ కార్డ్ అవసరమవుతుంది. ఫారిన్ కరెన్సీ కొనుగోలు చేయడానికి కూడా పాన్ కార్డును కచ్చితంగా ఇవ్వాలి. హోటల్ లేదా రెస్టారెంట్‌లో బిల్ పేమెంట్ 50,000 రూపాయలు దాటితే పాన్ కార్డ్ నంబర్ చెప్పాలి. డీమ్యాట్ అకౌంట్ తెరవాలన్నా లేదా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి.

    క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నా పాన్ కార్డ్ కచ్చితంగా కలిగి ఉండాలి. బ్యాంకుల్లో కొత్తగా ఖాతా తెరవాలని భావించే వాళ్లు సైతం పాన్ కార్డును కలిగి ఉండాలి. టూవీలర్ మినహా ఇతర వాహన కొనుగోలు లేదా అమ్మకానికి పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాలనే సంగతి తెలిసిందే.