https://oktelugu.com/

ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండానే?

ప్రముఖ ఏవియేషన్ సంస్థలలో ఒకటైన ఎయిర్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిర్‌ ఇండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిటిమెట్‌ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో చీఫ్‌ ప్రాపర్టీస్‌ అండ్‌ మానిటైజేషన్‌ ఆఫీసర్‌, చీఫ్‌ పర్సనల్‌ అండ్‌ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 19, 2021 / 02:58 PM IST
    Follow us on

    ప్రముఖ ఏవియేషన్ సంస్థలలో ఒకటైన ఎయిర్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిర్‌ ఇండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిటిమెట్‌ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

    ఈ ఉద్యోగ ఖాళీలలో చీఫ్‌ ప్రాపర్టీస్‌ అండ్‌ మానిటైజేషన్‌ ఆఫీసర్‌, చీఫ్‌ పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌, డిప్యూటీ చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌, మేనేజర్‌, ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. లా డిగ్రీ/ ఎల్‌ఎల్‌ఎం, ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీల గురించి ఆసక్తి ఉన్న అభ్యర్థులు కంపెనీ సెక్రెటరీ, ఏఐ అసెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌, రూమ్‌ నెం 208, సెకండ్‌ ఫ్లోర్‌, ఏఐ రిజర్వేషన్‌ బిల్డింగ్‌, సఫ్దార్‌జంగ్‌ ఎయిర్‌ పోర్ట్‌, న్యూఢిల్లీ – 110003 అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

    పర్సనల్‌ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.airindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.