పేద విద్యార్థులకు ఎల్ఐసీ శుభవార్త.. 20వేల రూపాయల స్కాలర్ షిప్..?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిభ ఉండి డబ్బు లేకపోవడం వల్ల చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో 20,000 రూపాయల స్కాలర్ షిప్ అందిస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఎల్ఐసీ ఈ స్కాలర్ షిప్ అందిస్తోంది. Also Read: నిరుద్యోగులకు బంపర్ […]

Written By: Navya, Updated On : December 3, 2020 10:46 am
Follow us on


దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిభ ఉండి డబ్బు లేకపోవడం వల్ల చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో 20,000 రూపాయల స్కాలర్ షిప్ అందిస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఎల్ఐసీ ఈ స్కాలర్ షిప్ అందిస్తోంది.

Also Read: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. లక్ష రూపాయల వేతనంతో ఉద్యోగాలు..?

దేశవ్యాప్తంగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. డివిజ‌న‌ల్ సెంట‌ర్ ప్రకారం ఎల్ఐసీ విద్యార్థులను స్కాలర్ షిప్ కు ఎంపిక చేస్తోంది. ఒక్కో డివిజనల్ సెంటర్ 20 మంది విద్యార్థులు ఎంపికవుతారు. 10 మంది బాలికలు, 10 మంది బాలురను ఎంపిక చేస్తారు.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!

పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులవుతారు. 60 శాతం కనీస మార్కులతో పది, ఇంటర్ పాసైన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.licindia.in/ వెబ్ సైట్ లో ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. 60 శాతం కంటే ఎక్కువ మార్కులతో పాస్ అయిన పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

ఉన్నత చదువులు చదువుతూ మంచి మార్కులు వస్తే మాత్రమే ఈ స్కాలర్ షిప్ ను రాబోయే సంవత్సరాల్లో సైతం పొందే అవకాశం ఉంటుంది. డిసెంబర్‌ ‌31వ తేదీ 2020 లోగా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ఆదాయ వర్గాలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే ఈ స్కాలర్ షిప్ ను పొందవచ్చు.