ప్రముఖ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పాయి. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో ఈ కంపెనీలు భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమయ్యాయి. వచ్చే ఏడాది కాలంలో ఈ రెండు కంపెనీలు ఏకంగా 65,000 ఉద్యోగాల భర్తీ చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కంపెనీలు భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టడం గమనార్హం.
దేశంలో కరోనా విజృంభణ వల్ల పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతేడాది ఇన్ఫోసిస్ ఇండియాలో 21,000 మందిని నియమించుకోగా ఈ ఏడాది 25,000 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. ఈ ఉద్యోగాలలో 24,000 ఉద్యోగాలను కేవలం భారతీయులకే కేటాయించడం గమనార్హం. సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలు కోరుకునే వారికి ఇది నిజంగానే శుభవార్త అని చెప్పాలి.
ఇన్ఫోసిస్ కంపెనీ ఇండియాలోని ఇంజనీరింగ్ క్యాంపస్ ల ద్వారా ఉద్యోగాల భర్తీ చేయనుందని తెలుస్తోంది. 2021 – 2022 ఆర్థిక సంవత్సరంలో టాటా కన్సల్టన్సీ సర్వీసెస్ 40,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటన చేసింది. గతేడాది 40,185 మంది ఉద్యోగులను నియమించుకున్న టీసీఎస్ ఈ ఏడాది కూడా దాదాపు అదే స్థాయిలో ఉద్యోగులను నియమించుకుంటూ ఉండటం గమనార్హం.
రెండు దిగ్గజ ఐటీ కంపెనీలు ఏకంగా 65,000కు పైగా ఉద్యోగులను నియమించుకుంటూ ఉండటం గమనార్హం. కంపెనీలు వేల సంఖ్య లో ఫ్రెషర్స్ ను నియమించుకుంటూ ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.