HPCL Recruitment 2021: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వేర్వేరు విభాగాల్లో మొత్తం 255 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో భారీ ఉద్యోగాలతో పాటు చిన్న ఉద్యోగ ఖాళీలు కూడా ఉండటం గమనార్హం. మెకానికల్ ఇంజనీర్, సాయిల్ అనలిస్ట్, కేన్ క్లర్క్, మేనేజర్, ఈటీపీ ఆపరేటర్, ఎన్విరాన్‌మెంటల్ ఆఫీసర్, ఈడీపీ ఆఫీసర్, ఈటీపీ ఆపరేటర్, ల్యాబ్ కెమిస్ట్, , ఈడీపీ ఆఫీసర్, బాయిలర్ అటెండెంట్, ఫిట్టర్, రిగ్గర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి షుగర్ ఇంజనీరింగ్, ఫైనాన్స్, ఈడీడీ, ఇథనాల్, జనరల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. పది అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో పాసై డిప్లొమా, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, ఎంబీబీఎస్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు పనిలో తప్పనిసరిగా అనుభవం ఉండాలి.
18 నుంచి 57 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్, హౌజ్ నెం -9, శ్రీ సడాన్, పాట్నా 800013 అడ్రస్ కు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి. అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://www.hpclbiofuels.co.in/home.php వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.