Homeఎడ్యుకేషన్Navodaya Jobs 2024: నవోదయ ఉద్యోగాలకు అప్లయ్‌ చేశారా.. ఇంకా నాలుగు రోజులే గడువు!

Navodaya Jobs 2024: నవోదయ ఉద్యోగాలకు అప్లయ్‌ చేశారా.. ఇంకా నాలుగు రోజులే గడువు!

Navodaya Jobs 2024: దేశంలోని నవోదయ విద్యాలయాల్లో బోధనేతర(నాన్‌ టీచింగ్‌) సిబ్బంది నియామకానికి దరఖాస్తు గడువును నవోదయ విద్యాలయ సమితి పొడిగించింది. నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 30తో గడువు ముగిసింది. అయితే దానిని మే 7వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

1,377 పోస్టులు..
దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్‌ టీచింగ్‌ సిబ్బంది భర్తీకి గత నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఉద్యోగ స్థాయిని బట్టి భారీ వేతనాలు అందించనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు మే 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు ఇవే..
ఫీమే స్టాఫ్‌.. నర్స్‌ పోస్టులు 121, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ – 05, ఆడిట్‌ అసిస్టెంట –12, జూనియర్‌ ట్రాన్సలేషన్‌ ఆఫీసర్‌ –04, లీగల్‌ అసిస్టెంట్‌ –1, స్టెనో గ్రాఫర్‌ 23, కంప్యూటర్‌ ఆపరేటర్‌ 2, క్యాటరింగ్‌ సూపర్‌వైజర్‌ – 78, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 381, ఎలక్ట్రీషియన్‌ కమ్‌ ప్లంబర్‌ 128, ల్యాబ్‌ అటెండెంట్‌ 161, మెస్‌ హెల్పర్‌ 442, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ 19, చొప్పున పోస్టులు ఉన్నాయి.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి నుంచి 12వ తరగతి, సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ. పీజీ, ఉత్తీర్ణతతోపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

వేతనాలు ఇలా..
ఇక ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌(లెవెల్‌–7) వేతనం రూ.44,900 నుంచి రూ.1,42,400, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, ఆడిట్‌ ఆఫీసర్, లీగల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.35,400, రూ.1,12,400 వరకు, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్‌ ఆపరేటర్, క్యాటరింగ్‌ సూపర్‌వైజర్‌ ఉద్యోగాలకు రూ.25,500 నుంచి రూ.81,100, జూనియర్‌ సెక్రటేరియేట్‌ అసిస్టెంట్‌(హెచ్‌క్యూ/ఆర్వో క్యాడర్‌), జూనియర్‌ సెక్రటేరియట్‌(జేఎస్‌వీ క్యాడర్‌), ఎలక్ట్రీషియన్‌ కమ్‌ ప్లంబర్‌ రూ.19,900 నుంచి రూ.63,200, ల్యాబ్‌ అటెండెంట్, మెస్‌ హెల్పర్, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగులకు రూ.18 వేల నుంచి రూ.56,900 చొప్పున ఇస్తారు.

దరఖాస్తు ఫీజు..
జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూస్‌ అభ్యర్థులకు రూ.1500(ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు) రూ.1000(ఇతర పోస్టులకు), ఎస్సీ,/ఎస్టీ/దివ్యాంగులకు రూ.500.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవీ..
అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాకపట్నం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌.

ఎంపిక విధానం ఇలా..
ఇక ఉద్యోగాలకు ఎంపిక రాత పరీక్ష, ట్రేడ్‌/స్కిల్‌ టెస్టు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రేమ ఉంటుంది. తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version