IPPB: నిరుద్యోగులకు శుభవార్త.. ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఏడాదికి రూ.25 లక్షల వేతనం!

మొత్తం 54 పోస్టులు. వీటిలో ఎగ్జిక్యూటివ్‌ (అసోసియేట్‌ కన్సల్టెంట్‌) 28 పోస్టులు, ఎగ్జిక్యూటివ్‌ (కన్సల్టెంట్‌) పోస్టులు 21, ఎగ్జిక్యూటివ్‌ (సీనియర్‌ కన్సల్టెంట్‌) పోస్టులు 5 చొప్పున ఉన్నాయి.

Written By: Raj Shekar, Updated On : May 10, 2024 9:59 am

IPPB

Follow us on

IPPB: నిరుద్యోగులకు పోస్టల్‌ శాఖ శుభవార్త చెప్పింది. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఐపీపీబీ) ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన 54 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు అర్హులైనవారు మే 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. బీటెక్‌ / బీఎస్సీ/ ఎంసీఏ తదితర విద్యార్హతల ఆధారంగా పోస్టులకు ఎంపికైన వారికి హోదా ఆధారంగా వేతనం రూ.25 లక్షల వరకు ఉంటుందని వివరించింది.

పోస్టుల వివరాలు..
మొత్తం 54 పోస్టులు. వీటిలో ఎగ్జిక్యూటివ్‌ (అసోసియేట్‌ కన్సల్టెంట్‌) 28 పోస్టులు, ఎగ్జిక్యూటివ్‌ (కన్సల్టెంట్‌) పోస్టులు 21, ఎగ్జిక్యూటివ్‌ (సీనియర్‌ కన్సల్టెంట్‌) పోస్టులు 5 చొప్పున ఉన్నాయి.

విద్యార్హతలు..
బీఈ/బీటెక్‌ లేదా బీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ/ఎలక్ట్రానిక్స్‌) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతోపాటు ఆయా పోస్టులను బట్టి కనీసం ఏడాది నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి.

వేతనం వివరాలు..
ఎగ్జిక్యూటివ్‌ (అసోసియేట్‌ కన్సల్టెంట్‌) పోస్టుకు ఏడాదికి రూ.10,00,000, ఎగ్జిక్యూటివ్‌ (కన్సల్టెంట్‌) పోస్టులకు రూ.15,00,000, ఎగ్జిక్యూటివ్‌ (సీనియర్‌ కన్సల్టెంట్‌) పోస్టుకు రూ.25,00,000 చొప్పున వేతనం చెల్లించనున్నారు.

దరఖాస్తు రుసుం..
ఆయా పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.750, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రూ.150 మాత్రమే చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ ఇలా..
అభ్యుర్థుల ఎంపిక అసెస్మెంట్, ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కర్షన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు మొదట ఢిల్లీ/ముంబై/చెన్నైలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.

వయో పరిమితి..
అసోసియేట్‌ కన్సల్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 22 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి. కన్సల్టెంట్‌ పోస్టులకు 22 నుంచి 40 ఏళ్లు, సీనియర్‌ కన్సల్టెంట్‌కు దరఖాస్తు చేసేవారి వయసు 22 నుంచి 45 ఏళ్లుగా నిర్ణయించారు.