https://oktelugu.com/

పాత పీఎఫ్ అకౌంట్ లో డబ్బులు సులభంగా డ్రా చేయొచ్చు.. ఎలా అంటే..?

మనలో చాలామంది కంపెనీ మారిన తరువాత పాత పీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోకుండా మరో పీఎఫ్ అకౌంట్ ను తీసుకుంటూ ఉంటారు. పాత పీఎఫ్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయని తెలిసినా ఆ అకౌంట్ కు సంబంధించిన వివరాలు తెలియకపోవడం వల్ల ఆ అకౌంట్ లోని డబ్బులు డ్రా చేసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. పీఎఫ్ అకౌంట్ లో ప్రతి నెలా డబ్బులు జమ కాకపోతే ఆపరేటివ్ అకౌంట్ నాన్ ఆపరేటివ్ అకౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 25, 2020 / 02:46 PM IST
    Follow us on


    మనలో చాలామంది కంపెనీ మారిన తరువాత పాత పీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోకుండా మరో పీఎఫ్ అకౌంట్ ను తీసుకుంటూ ఉంటారు. పాత పీఎఫ్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయని తెలిసినా ఆ అకౌంట్ కు సంబంధించిన వివరాలు తెలియకపోవడం వల్ల ఆ అకౌంట్ లోని డబ్బులు డ్రా చేసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. పీఎఫ్ అకౌంట్ లో ప్రతి నెలా డబ్బులు జమ కాకపోతే ఆపరేటివ్ అకౌంట్ నాన్ ఆపరేటివ్ అకౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది.

    Also Read: దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కోర్సులు నేర్చుకునే ఛాన్స్.?

    పాత పీఎఫ్ అకౌంట్ లో డబ్బులను విత్ డ్రా చేసుకోవాలంటే మొదట ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్ లోని ఫిర్యాదులకు సంబంధించిన హెల్ప్ డెస్క్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులో గతంలో పని చేసిన కంపెనీ వివరాలను, వ్యక్తిగత వివరాలను పొందుపరచాలి. వ్యక్తిగత వివరాలు, కంపెనీ వివరాల ఆధారంగా సులభంగా పాత పీఎఫ్ అకౌంట్ వివరాలను హెల్ప్ డెస్క్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత పాత పీఎఫ్ అకౌంట్ కు బ్యాంక్ అకౌంట్ ను జత చేసి పీఎఫ్ ఖాతాలోని నగదును బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేలా చేసుకోవచ్చు.

    Also Read: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రెండు కీలక నిర్ణయాలు..?

    కేంద్రం యాక్టివ్ మోడ్ లో ఉన్న పీఎఫ్ అకౌంట్లలో మాత్రమే వడ్డీని జమ చేస్తుంది. అందువల్ల పీఎఫ్ అకౌంట్లు పని చేయకపోయినా అందులో ఉన్న డబ్బులపై ఎలాంటి వడ్డీ రాదు. నాన్ ఆపరేటివ్ పీఎఫ్ అకౌంట్ల ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల పీఎఫ్ అకౌంట్ లోని డబ్బును విత్ డ్రా చేసుకుంటే మంచిది. అయితే మూడు సంవత్సరాలు యాక్టివ్ గా ఉన్న పీఎఫ్ అకౌంట్లకు మాత్రం వడ్డీ లభిస్తుంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పీఎఫ్ వడ్డీరేటులో మార్పులు చేస్తుంది. ప్రస్తుతం పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది. పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లు నిబంధనల గురించి అవగాహన ఏర్పరచుకోవడం వల్ల పీఎఫ్ ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు.