
ది ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ అనుభవం ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 18 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ 18 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే నెల 22వ తేదీలోగా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
https://apmdc.ap.gov.in/ వెబ్ సైట్ లో ఈ 18 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. 18 ఉద్యోగ ఖాళీలలో జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగాల్లో ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. డిగ్రీతోపాటు ఎంబీఏ, సీఏ చదివి ఐసీఎస్ఐ సర్టిఫికెట్ తో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు 2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాటికి 54 ఏళ్లు మించకూడదు.
5 డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎన్విరాన్‌మెంటల్, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, ఇతర విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుంది. డిగ్రీతోపాటు ఎంబీఏ, సీఏ, ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాటికి 45 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 11 ఉండగా 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు apmdchrdrecruitments@gmail.com ఈమెయిల్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.