AP DSC: నిరుద్యోగులకు ఇది గొప్ప న్యూస్.. రెడీ అవ్వండి

టెట్ పరీక్షలు ముగిసిన వెంటనే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. దీంతో ప్రిపరేషన్ కు తగిన సమయం దొరకడం లేదని కొందరు కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.

Written By: Dharma, Updated On : March 10, 2024 3:25 pm

AP DSC

Follow us on

AP DSC: ఏపీ డీఎస్సీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విషయంలో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గడువు విషయంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ కొత్త షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు ఆప్షన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 25 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ కు అవకాశం కల్పిస్తారు.

టెట్ పరీక్షలు ముగిసిన వెంటనే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. దీంతో ప్రిపరేషన్ కు తగిన సమయం దొరకడం లేదని కొందరు కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు ఒత్తిడికి లోనవుతున్నారని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు.. టెట్, డీఎస్సీ మధ్య నాలుగు వారాలు గడువు ఉండేలా పరీక్షల షెడ్యూల్ చేయాలని మార్చి 4న ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కొత్త షెడ్యూల్ పాఠశాల విద్యాశాఖ ప్రకటించాల్సి వచ్చింది.

మార్చి 30 నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 30 వరకు కొనసాగనున్నాయి. రోజుకు రెండు సెక్షన్ల చొప్పున 10 సెషన్లలో ఎస్జీటీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న టీజీటీ, పిజిటి, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి 30 వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పిజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. మార్చి 20 నుంచి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి ఆప్షన్లు ఇస్తారు. మార్చి 25 నుంచి అభ్యర్థుల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.