కడప జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మహిళలకు అదిరిపోయే తీపికబురు అందించింది. పది పాసైన మహిళలకు ప్రయోజనం చేకూరేలా అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 288 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. విడుదలైన నోటిఫికేషన్ లో అంగన్ వాడీ కార్యకర్త జాబ్ తో పాటు అంగన్ వాడీ సహాయకురాలు, మినీ అంగన్ వాడీ కార్యకర్త విభాగాలలో ఖాళీలు ఉన్నాయి.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. https://kadapa.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభిస్తుంది. అంగన్ వాడీ కార్యకర్త విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి.
అంగన్ వాడీ సహాయకురాలి విభాగంలో 225 ఉద్యోగ ఖాళీలు ఉండగా మినీ అంగన్ వాడీ కార్యకర్త విభాగంలో మాత్రం కేవలం 13 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. పది పాసై పెళ్లైన మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన మహిళ స్థానికంగా నివాసం ఉండాలి. 21 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతను కలిగి ఉంటారు. ఈ నెల 31 ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ కార్యాలయం, కడప జిల్లా, ఏపీ అడ్రస్ లో నిర్ణీత సమయంలోగా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. టెన్త్ మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.