https://oktelugu.com/

Aryan Khan: ఆర్యన్ ఖాన్ కేసులో సమాధానం లేని కొన్ని ప్రశ్నలు..ఇవే..

Aryan Khan:  డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ విషయం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే మారింది. అతడితో పట్టుబడిన ఇద్దరికి బెయిల్ లభించగా.. ఆర్యన్ కు మాత్రం దొరకలేదు. ఈనెల క్రూయిజ్ షిప్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో ఆయన ఇప్పటికీ పోలీస్ కస్టడీలోనే ఆర్యన్ ఉన్నారు. అరెస్టయిన సందర్భంలో ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదు. కానీ ఆయన స్నేహితుడు అర్భాజ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2021 / 09:54 AM IST
    Follow us on

    Aryan Khan:  డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ విషయం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే మారింది. అతడితో పట్టుబడిన ఇద్దరికి బెయిల్ లభించగా.. ఆర్యన్ కు మాత్రం దొరకలేదు. ఈనెల క్రూయిజ్ షిప్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో ఆయన ఇప్పటికీ పోలీస్ కస్టడీలోనే ఆర్యన్ ఉన్నారు. అరెస్టయిన సందర్భంలో ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదు. కానీ ఆయన స్నేహితుడు అర్భాజ్ దగ్గర డ్రగ్స్ లభించింది. దీంతో ఆర్యన్ ఖాన్ తో పాటు మరో నలుగురికి ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. ఆర్యన్ ఖాన్ తో ఉన్న మరో ఇద్దరికి ఇప్పటికీ బెయిల్ లభించడం లేదు. ఆయనకు బెయిల్ ఇస్తే మళ్లీ ఇదే నేరానికి పాల్పడే అవకాశం ఉందని ఎన్సీబీ కోర్టుకు నివేదిక అందించింది. అయితే ఈ కేసులో ఎన్సీబీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కొందరు విమర్శలు చేస్తున్నారు.

    aryan khan1

    ఆర్యన్ ఖాన్(Aryan Khan) ను అరెస్టు చేసిన తరువాత కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ద్వారా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఎన్సీబీ గుర్తించి, వారిని విచారిస్తోంది. ఇక క్రూయిజ్ దాడులో ప్రభాకర్ సాయల్ ప్రధాన సాక్షిగా ఎన్సీబీ పేర్కొంటోంది. కానీ ఎన్సీబీ చీఫ్ సమీర్ వాంఖడే, ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశాడన్న ఆరోపణలు వస్తున్నాయి. మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఎన్సీబీని కొన్ని ప్రశ్నలను వేస్తున్నారు.

    క్రూయిజ్ షిప్ లో దాడులు జరిగినప్పుడు ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. ఆయన అరెస్టు తరువాత ఏడీపీసీ చట్టం సెక్షన్ 8సి, 20బి కింద అరెస్టు చేశారు. కానీ ఆర్యన్ రక్త నమూనాలు, వెంట్రుకల వంటి శాంపిళ్లు ఏవీ తీసుకోలేదు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వినియోగించడానికి ఎన్సీబీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. మొదట ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరికాయని చెప్పిన ఎన్సీబీ, ఆ తరువాత ఎలాంటి మాదక ద్రవ్యాలు లభించలేదని చెప్పారు. ఎన్సీబీ నమోదు చేసిన ఈ మొత్తం కేసు ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ స్వాధీనం, వినియోగానికి సంబంధించి గాని ప్రాసిక్యూషన్ వద్ద బలమైన ఆధారాలు ఏమీ లేవు.

    దాదాపు 28 రోజులుగా ఆర్యన్ ఖాన్ కు బెయిల్ లభించడం లేదు. ఈనెల 20న విచారించిన కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తరువాత 26న విచారణ జరిపి 27కు వాయిదా వేసింది. జూలై 15న ద టైమ్స్ ఆప్ ఇండియా ప్రచురించిన ఒక రిపోర్టు ప్రకారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అధ్యక్షతన ఏర్పాటైన ఓ ధర్మాసం సోషల్ మీడియాలోని చాట్స్ ఆధారం చేసుకొని ప్రాధాన్యం ఇవ్వలేమని చెప్పింది. కానీ ఎన్సీబీ మాత్రం తమ వద్ద ఆర్యన్ ఖాన్ కు సంబంధించిన వాట్సాప్ చాట్ ఉందని తెలుపుతున్నారు. అయితే ఎన్సీబీ వద్ద వాట్సాప్ చాట్ ఉంటే దానిని కోర్టుకు సమర్పించాలి కదా అని న్యాయవాది ఆషిమా మండల్ అంటున్నారు.

    ఆర్యన్ ఖాన్ అరెస్టు తరువాత ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకోవడం వివాదాస్పదమైంది. ఆ వ్యక్తి కిరణ్ గోస్వామి అని అధికారులు తేల్చారు. అయితే ఆయనపై 2018 మేలో ఓ ఫ్రాడ్ కేసు నమోదైంది. ఈ కేసులో కిరణ్ గోస్వామి పరారీలో ఉన్నాడు. పోలీసులు ఆయనపై ఓ లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే ప్రభాకర్ సాయిల్ ఎన్సీబీ వాంఖడేపై కొన్ని ఆరోపణలు చేశారు. కిరణ్ గోస్వామి ఆయన బాడీగార్డు అని అన్నారు. దీంతో అసలు కిరణ్ గో స్వామి అక్కడు ఎందుకు ఉండాల్సి వచ్చింది..? అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 16న ముంద్రా రేవులో రూ.21 వేల కోట్ల హెరాయిన్ ను పట్టుకున్నారు. ఈకేసులో ఇప్పటికీ పురోగతి లేదు. అయితే ఆ కేసు దృష్టి మళ్లించడానికే ఎన్సీబీ క్రూయిజ్ పై దాడి చేసిందని అంటున్నారు.