MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ఓటమికి.. మంచు విష్ణు గెలుపునకు కారణాలేంటి?

MAA Elections 2021:  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అందరూ ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. గెలుస్తాడనుకున్న ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు. ఓడిపోతాడని.. అసలు అతడి వెనుక ఏ అగ్రహీరోలు, సినీ ప్రముఖులు లేరని భావించిన మంచు విష్ణు సునాయాసంగా గెలిచాడు. అసలు మంచు విష్ణు ఎలా గెలిచాడు..? ప్రకాష్ రాజ్ ఎందుకు ఓడిపోయాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అందరూ ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలోనే ‘మా’ ఎన్నికల్లో గెలుపోటములపై స్పెషల్ ఫోకస్.. మునుపెన్నడూ […]

Written By: NARESH, Updated On : October 11, 2021 11:34 am
Follow us on

MAA Elections 2021:  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అందరూ ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. గెలుస్తాడనుకున్న ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు. ఓడిపోతాడని.. అసలు అతడి వెనుక ఏ అగ్రహీరోలు, సినీ ప్రముఖులు లేరని భావించిన మంచు విష్ణు సునాయాసంగా గెలిచాడు. అసలు మంచు విష్ణు ఎలా గెలిచాడు..? ప్రకాష్ రాజ్ ఎందుకు ఓడిపోయాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అందరూ ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలోనే ‘మా’ ఎన్నికల్లో గెలుపోటములపై స్పెషల్ ఫోకస్..

prakash-raj-vishnu 2

మునుపెన్నడూ లేనంత వివాదాలను, విద్వేషాలను సినీ ఇండస్ట్రీని రెండు వర్గాలుగా చీల్చింది ‘మా’ ఎన్నికలు.. అటు చిత్ర పరిశ్రమలోనూ ఇటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపాయి. ఇందులోకి రాజకీయాలను కూడా లాగిన పరిస్థితి. దీంతో ‘మా’ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.

ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీతోపాటు అగ్రహీరోల మద్దతున్నా వారు ముందుండి నడిపించలేకపోయారు. సినీ కళాకారులను మెప్పించి ప్రకాష్ రాజ్ కు ఓటు వేయించలేకపోయారు. మద్దతిచ్చి ఊరుకోవడంతో క్షేత్రస్థాయిలోని చిన్న చిన్న కళాకారులంతా మంచు విష్ణు చొరవ, ఓటు కోసం పడ్డ తపనకు, నాన్ లోకల్ నినాదానికి ఆకర్షితులై అతడినే గెలిపించారు. ఇక విష్ణుకు అగ్రహీరోలను మినహాయిస్తే మిగతా ఫేడ్ అవుట్ అయిపోయిన సినీ పెద్దల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించింది. మోహన్ బాబు స్వయంగా రంగంలోకి దిగి సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, దాసరి, బాలక్రిష్ణలను కలిసి మద్దతు కోరాడు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ ఇచ్చిన సలహాలు, సూచనలు కూడా విష్ణు గెలుపులో కీలకంగా పనిచేశాయి. ఇక విష్ణు లేవనెత్తిన ప్రకాష్ రాజ్ ‘నాన్ లోకల్’ బ్రహ్మాస్త్రంలా పనిచేసి తెలుగు సినీ కళాకారుల్లో ఆలోచనలకు దారితీసేలా చేశాయి.

మంచు విష్ణు గెలుపులో ఆయన మేనిఫెస్టో బాగా పనిచేసింది.అది సీన కళాకారులను ఆకర్షించింది. ‘మా యాప్’, జాబ్ కమిటీ ద్వారా ఉపాధి, ఇల్లు, ఈఎస్ఐ, హెల్త్ కార్డులు, బీమా, ఉచిత విద్య కళాకారులకు పెన్షన్ లాంటివి విష్ణు గెలుపులో కీలకంగా మారాయి.

మంచు విష్ణు ప్యానెల్ లో అన్ని వర్గాల వారిని ఎంపిక చేసుకోవడం అతడికి ప్లస్ పాయింట్ కాగా.. సినీ పేరున్న సెలబ్రెటీలను, మెగా ఫ్యామిలీ మద్దతుదారులనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులుగా ఎంపిక చేసుకోవడం మైనస్ గా మారింది. ఇక మంచు విష్ణు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్తించాడు. ప్రకాష్ రాజ్ అది చేయలేకపోయాడు. ప్రతి ఒక్కరితోనూ మంచు విష్ణు మాట్లాడి మేనిఫెస్టో వివరించి వారి మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఇదే అతడి విజయానికి కారణమైంది.

ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా నెగెటివ్ గా మారింది. అతడు ప్రత్యర్థి వర్గం పన్నిన వ్యూహంలో చిక్కుకున్నాడు. అహం ఎక్కువ అని.. షూటింగ్ లకు రాడని.. నిర్మాతలతో గొడవలు హైలెట్ అయ్యాయి. ఇక బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ ను హిందూ వ్యతిరేకి అంటూ .. హిందూ సంప్రదాయాల పట్ల గౌరవం లేదనడం కూడా మైనస్ గా మారింది. ప్రకాష్ రాజ్ గెలిస్తే హైదరాబాద్ లో ఉండడన్న ప్రచారం అతడికి శరాఘాతంగా మారింది.

మంచు విష్ణు తెచ్చిన ‘పోస్టల్ బ్యాలెట్’ వ్యూహం అతడికి మంచి ఓట్లు రాబట్టింది. డబ్బులన్నీ కట్టి మరీ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి తనకే వేసుకునేలా విష్ణు చేసుకున్నాడు. హైదరాబాద్ లో లేని నటులను విమాన టికెట్లు బుక్ చేయించి మరీ రప్పించి విష్ణు ఓటు వేయించుకోవడం విశేషం.

ఇక ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా పట్టు సాధిస్తున్న మెగా ఫ్యామిలీ ఆధిపత్యం కూడా ప్రకాష్ రాజ్ ఓటమిలో ఓ భాగమైంది.. టాలీవుడ్ లో గుత్తాధిపత్యంగా ఉన్న మెగా ఫ్యామిలీ సపోర్టు కలిగిన ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంలో ఓటర్లు ఐకమత్యాన్ని చాటారు. మెగా ఆధిపత్యాన్ని నిలువరించడంలో ప్రత్యర్థి వర్గం సక్సెస్ అయ్యింది. అన్ని వర్గాల మద్దతు కూడగట్టడంలో ప్రకాష్ రాజ్ విఫలం కావడం కూడా అతడి ఓటమికి కారణంగా చెబుతున్నారు. కేవలం మెగా ఫ్యామిలీపైనే ఆధారపడడం మైనస్ అయ్యిందని చెబుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తొందరపాటుతనం.. సీనియర్ నటులపై తిట్ల వర్షం కూడా ప్రకాష్ పాలిట శాపంగా మారిందంటున్నారు. ఇక మంచు విష్ణు ‘లోకల్’ మంత్రంగా బాగా పనిచేసింది. నాన్ లోకల్ నినాదం ప్రకాష్ రాజ్ ను చావుదెబ్బతీసింది.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఇప్పుడు ప్రకాష్ రాజు సొంత నిర్ణయాలు, ప్రత్యర్థుల వ్యూహాలు ఆయన ఓటమికి కారణాలుగా నిలిచాయి. అందరినీ కలుపుకొని క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఓటు అభ్యర్థించిన మంచు విష్ణును ఈజీగా గెలిచేలా చేశాయి.