BJP: కొత్త ఏడాదిలో బీజేపీ కొత్త సవాళ్లను ఎదుర్కోబోతుంది. కీలకమైన ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అలర్ట్ అవుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. మరో మూడునెలల సమయమే ఎన్నికలకు సమయం ఉండటంతో బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు.
బీజేపీ కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో సహజంగానే కొంత వ్యతిరేకత వచ్చింది. దీనికితోడు పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యాసర ధరలు పెరగడం, కేంద్రం చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేయడం వంటివి బీజేపీపై ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచాయి.
అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలో ఉన్నా రాష్ట్రాల్లో తిరిగి వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే మరో మూడునెలల్లో పరిస్థితి మారే అవకాశం ఉందనే వాదనలు విన్పిస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దేశంలోనే అత్యధిక అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ బీజేపీకి కీలకంగా మారింది. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీనే కేంద్రంలోకి అధికారంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈనేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ బీజేపీ చేజారిపోకుండా కమలదళం పకడ్బంధీ వ్యూహాలు రచిస్తుంది.
403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో బీజేపీకి 200లకు పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అలాగే అఖిలేష్ యాదవ్ సారథ్యం వహిస్తున్న సమాజ్ వాద్ పార్టీకి కూడా అధికారం దగ్గరలో ఉందని సర్వేలు పేర్కొంటున్నాయి. మరో మూడునెలల్లో వచ్చే వ్యతిరేకతను బట్టి బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేది లేనేది తేలిపోనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్ లో బీజేపీ తన మిత్రపక్షమైన అకాలీదశ్ తో కటిఫ్ చేసుకుంది. ఆపార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి వచ్చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో పొత్తు పెట్టుకుంది. ఈ ప్రభావం బీజేపీపై పడే అవకాశం కన్పిస్తుంది. ప్రస్తుతం పంజాబ్ లో బీజేపీ ఖాతా తెరువడమే గొప్ప అనే టాక్ విన్పిస్తోంది.
ఇక ఉత్తరాఖండ్‌పై బీజేపీ ఎప్పుడో ఆశలు వదిలేసుకుది. మూడు సార్లు సీఎంలను మార్చడంతో బీజేపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. పార్టీలో అసంతృప్తి పెరిగిపోవడంతో బీజేపీ అధికారంలోకి రావడం కష్టంగా కన్పిస్తోంది.
గోవాలో మనోహర్ పారీకర్ మృతి తర్వాత బీజేపీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు. అయితే కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు బీజేపీలోకి రావడంతో తిరిగి ఆపార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని బెట్టుకుంది. కాగా ఇక్కడ ఆమ్ ఆద్మీ క్రమంగా ఎదుగుతోంది.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో బీజేపీ సంకీర్ణం అధికారంలో ఉంది. అయితే ఈసారి ఇక్కడ కాంగ్రెస్‌కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొంచెం కష్టమైనా తిరిగి కాపాడుకుంటుందని తెలుస్తోంది.
ఇక మిగితాచోట్ల మాత్రం బీజేపీకి ఏమాత్రం ఛాన్స్ ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో మూడునెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను బట్టి ఏ పార్టీ అధికారంలో వస్తుంది? రానిది అనేది తేలనుంది. దీంతో ఈ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.