Analysis On Mohan Babu Letter : టాలీవుడ్ చిత్రపరిశ్రమ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిన్న చిరంజీవి నేను ఇండస్ట్రీ పెద్దను కాదలుచుకోలేదని చేసిన ప్రకటన సంచలనమైంది. దానికి కౌంటర్ గా మోహన్ బాబు లేఖ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. మోహన్ బాబు లేఖ సినీ ఇండస్ట్రీ సంక్షోభాన్ని గట్టెక్కించేలా ఉందా? అంటేలేదనే చెప్పాలి. మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉంది.
చిరంజీవి అందరినీ కలుపుకొని పోయి సమస్య పరిష్కరించే టైపు. కానీ మోహన్ బాబు ఒక డివైడర్ లాగా అందరినీ విభజించే టైపు. చిరంజీవితో మోహన్ బాబు పోల్చుకోవడం అంతకంటే దండగ మరొకటి లేదు. చిరంజీవితో పోల్చితే మోహన్ బాబుకు అసలు ఇమేజ్ నే లేదు.
వ్యక్తిత్వంలోనూ చిరంజీవికి మంచివాడుగా ప్రజల్లో పేరుంది. టాలీవుడ్ లోని వ్యవహారాలు చూసి తనకు పెద్దరికం వద్దని చిరంజీవి వినమ్రంగా చెప్పుకొచ్చాడు. కానీ ఇటీవల ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు వర్గం విధ్వేషాలు చూసి చిరంజీవియే తప్పుకున్నట్టు తెలుస్తోంది.
నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు హీరోలే టాలీవుడ్ కాదని.. అందరినీ కలుపుకొని పోవాలని మోహన్ బాబు అన్నారు. కానీ పరోక్షంగా తనను గుర్తించాలన్నారు. మరి జగన్ కు సన్నిహితుడైన మోహన్ బాబు ఎందుకు టాలీవుడ్ తరుఫున సమస్యలను ఆయనను కలిసి పరిష్కరించడం లేదన్నది ఇక్కడ ప్రశ్న. అటు జగన్ ను అడగకుండా.. ఇటు అడిగేవారిపై పడుతున్న మోహన్ బాబు తీరు ఇప్పుడు ఇండస్ట్రీకే నష్టంగా మారింది.. మోహన్ బాబు లేఖ సమస్యను పరిష్కరించే రీతులో ఉందా? లేదా? అన్నదానిపై ‘రామ్’ వ్యూ పాయింట్ సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.