Three minor girls kidnapped: వారంతా బాలికలు. వయసు 14 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది. వారు హైదరాబాద్ నగరంలోని ఆల్వాల్ ప్రాంతంలో స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతున్నారు. బతుకమ్మ సెలవులు ప్రకటించడంతో.. ఆ పండుగలో పాల్గొంటామని ఇంట్లో చెప్పారు. తమ స్నేహితుల ఇంటి వద్ద బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతాయని.. అక్కడికి వెళ్తామని చెప్తే కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. సెప్టెంబర్ 20న వారు తమ స్నేహితులు ఉండే ప్రాంతమైన తార్నాకకు వెళ్లారు.
తార్నాక వెళ్లిన తర్వాత వారికి మధు, అరవింద్, నీరజ్ అనే యువకులు పరిచయమయ్యారు. కొద్దిరోజుల్లోనే ఆ ముగ్గురు బాలికలు, ఆ ముగ్గురు యువకుల మధ్య స్నేహం ఏర్పడింది. పరస్పరం మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది కాస్త వ్యక్తిగత చనువుకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే వారు ముగ్గురు కలిసి యాదగిరిగుట్ట వెళ్లాలని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించుకొని వెళ్లిపోయారు. యాదగిరిగుట్ట ప్రాంతంలో ఉన్న ఒక లాడ్జిలో మూడు గదులు తీసుకున్నారు. ముగ్గురు వేరువేరు గదిలో ఉండడం మొదలుపెట్టారు. మధు ఒక అమ్మాయితో, అరవింద్ ఇంకొక అమ్మాయితో, నీరజ్ మరొక అమ్మాయితో ఉన్నారు. వయసులో ఉండడం.. అది కూడా ఏకాంతంగా ఉండడంతో చేయకూడని తప్పు చేశారు. వాస్తవానికి ఆ ముగ్గురు బాలికలకు మధు, అరవింద్, నీరజ్ మాయమాటలు చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్దిరోజులు అక్కడ ఉన్న తర్వాత ఆ బాలికలు వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
బతుకమ్మ ఆడేందుకు వెళ్లిన తమ పిల్లలు ఇన్ని రోజుల తర్వాత ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. దానికంటే ముందు ఆ ముగ్గురు బాలికలకు ఫోన్ చేసినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదు. ఆమె ఫ్రెండ్ కి ఫోన్ చేస్తేనేమో.. వారి యాదగిరిగుట్ట వెళ్లిపోయారని సమాధానం చెప్పింది. ఆమె చెప్పిన సమాధానంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఆ మరుసటి రోజు ఈ ముగ్గురు అమ్మాయిలు వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లారు. కుటుంబ సభ్యులు నిలదీయడంతో అసలు విషయం చెప్పారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధు, అరవింద్, మీద కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేశారు. బాలికలకు గదులు అద్దెకిచ్చిన లాడ్జి నిర్వాహకుడు కూడా అరెస్టయ్యాడు.