Fayyaz Arrest: పులిలాంటి క్రూర జంతువు ఆకలి వేస్తేనే వేటాడుతుంది. ఆకలి తీరితే పక్కనుంచి జింక వెళ్లినా సరే పట్టించుకోదు. ఎందుకంటే దానికి ఆకలి తీరితే సరిపోతుంది. కానీ మనుషులు అలా కాదు.. మనుషుల్లో ఉన్న లోభం .. అత్యాశ వల్ల దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఘోరాలు చేస్తున్నారు. సాటి మనుషులపై ఏమాత్రం సానుభూతి లేకుండా దాడులు చేస్తున్నారు. చివరికి అత్యంత క్రూరంగా చంపేస్తున్నారు. న్యాయస్థానాలు ఎన్ని రకాలుగా శిక్షలు వేసినా సరే ఈ తరహా వ్యక్తుల వ్యక్తిత్వం మారడం లేదు. పైగా కొత్త కొత్తగా వారిలో క్రూరమైన ఆలోచనలు పుడుతున్నాయి.
మనదేశంలో ఇటీవల మొహర్రం జరిగింది. ఇది ఒక సంతాప సందేశం లాంటి కార్యక్రమం. చనిపోయిన ముస్లింలను తలుచుకుని సాగించే వ్యవహారం. ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక వ్యక్తి నరమేధానికి వాడుకోవాలనుకున్నాడు. ఏకంగా 15000 మందిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి మొహర్రం సమయంలో ముస్లింలే ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. తోటి ముస్లింలనే చంపడానికి అతడు ప్రయత్నించాడు అంటే ఎంతటి క్రూరమైన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. పైగా పోలీసులు దర్యాప్తులో అతనికి సంబంధించిన అనేకమైన విషయాలు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది.
15 వేల మందిని చంపడానికి ప్రణాళిక రూపొందించిన ఆ వ్యక్తి పేరు ఫయాజ్.. ఇతడు ముంబైలో జరిగిన మొహర్రం ఊరేగింపులో విషపు క్యాప్సూల్ పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నాడు. అయితే అతని వ్యవహార శైలి ముందుగానే తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతని వద్ద నుంచి దాదాపు 14 వేల 900 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మరో 30 వేల క్యాప్సూల్స్.. 50 కిలోల ఎలుకల మందు అతడు ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. ఇంతమందిని చంపడానికి అతడు గొప్ప కార్యంగా చెబుతున్నాడు.
ఫయాజ్ ఉన్నత విద్యావంతుడు. ఇతడు బీబీఏ వరకు చదివాడు. ఇరాక్ లో చాలా కాలం ఉన్నాడు. ఆ తర్వాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. క్రూరంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. తోటి మనుషులను చంపడానికి తెగబడ్డాడు. సరైన సమయం కోసం చూస్తున్న అతడు మొహర్రం నాడు ఈ దారుణానికి పాల్పడేందుకు సిద్ధమయ్యాడు. అదృష్టవశాత్తు అతడి చేతిలో ఎవరూ చనిపోలేదు. అతడు ఇచ్చిన క్యాప్సూల్స్ ఎవరైనా తింటే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఇంతటి క్రూరమైన ఫయాజ్ ను జైల్లో పెట్టి మేపడం కంటే.. సజ్జనార్ మార్క్ న్యాయమే సరైనదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
