Wife beats Drunk Husband: ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి.. భర్తపై భార్య.. భార్యపై భర్త దాడి చేసిన సంఘటనలు బయటపడుతున్నాయి. అయితే ఎక్కువ శాతం భార్యలనే హతమార్చిన సంఘటనలు కలిసి వేస్తున్నాయి. కానీ తాజాగా ఓ భార్య తన భర్తను చితకబాదిన వీడియో సంచలనం రేపుతుంది. మద్యం తాగిన తన భర్తను ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. భయపెడుతూ.. హంగామా చేయడంతో బాధితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా అతడికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం విఎం బజార్ పరిధిలో లక్ష్మీ, గంగారం ఇద్దరూ భార్యాభర్తలు. వీరు స్థానికంగా ఉన్న జంగాల కాలనీలో 35 ఏళ్లుగా జీవిస్తున్నారు. అయితే ఇటీవల భర్త మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు. దీంతో ఇటీవల ఒక రోజు తన భర్తను ఇంట్లో ఉంచి ఇష్టం వచ్చినట్టు చితక చితకబాదింది. దీంతో తన పక్కటెముకలు విరిగిపోయాయని బాధితుడు వాపోయాడు. అయితే ఎలాగోలా తప్పించుకొని బయటపడిన.. వెంటపడి మరి కొట్టిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. చివరికి గంగారం పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు తీవ్ర గాయాలు అయినట్లు చెప్పాడు. అనంతరం ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే లక్ష్మీని ఈ విషయంపై విచారించగా.. తనకు దయ్యం పట్టిందని.. ఆ సమయంలో ఏం చేశానో తనకు తెలియదని చెప్పింది. భర్తకు గాయాలు కావడం చూసి తాను బాధపడడం తో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. గంగారం మాత్రం తనపై కావాలనే దాడి చేసిందని పేర్కొంటున్నాడు.
అయితే భర్త పై దాడి చేస్తున్న సంఘటనపై కొందరు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఎక్కువగా భార్యలపై దాడి జరుగుతుండగా.. ఇలా ఓ భర్తపై దాడి చేసిన సంఘటనపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అయితే గతంలోనూ భర్తల ప్రాణాలు తీసిన సంఘటనలు ఉన్నాయి.
మద్యానికి బానిసైన వారిని హెచ్చరిస్తున్నా.. కొందరు పట్టించుకోవడం లేదు. తిరిగి భార్యపైనే దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఇలా భర్త మద్యం తాగిన భర్త పై దాడి చేయడంపై కొందరు ప్రశంసిస్తున్నారు. మద్యం అలవాటుతో ఎన్నో రకాల అనర్ధాలు జరుగుతాయని చెబుతున్నారు. మరికొందరు మాత్రం భర్తను ఇంతలా హింసించడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో మీరు కూడా చూడండి..
View this post on Instagram