Cyber Fraud: ఒకరోజు 23.56 లక్షలు కొట్టేశారు. మరుసటి రోజు మూడు లక్షలు దోచుకున్నారు. ఆ తర్వాత మరో రెండుసార్లు 63 లక్షలు తన ఖాతాలోకి మళ్లించుకున్నారు. ఆ మరుసటి రోజు 17.10 లక్షలు తస్కరించారు. ఇలా ఏకంగా 63 సార్లు 8.6 కోట్లు కొల్లకొట్టారు. ఇన్నిసార్లు మోసపోయింది హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కు చెందిన ఓ వైద్యుడు.
షేర్ ట్రేడింగ్ పేరుతో ఆ వైద్యుడిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. తెలంగాణలో నమోదైన సైబర్ నేరాల చరిత్రలో ఇదే అతిపెద్ద మోసమని తెలుస్తోంది. దీనిని భారీ ఆన్ లైన్ మోసమని పోలీసులు చెబుతున్నారు.. ఈ వ్యవహారంపై ఈనెల 12న ఆ వైద్యుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యాప్తు మొదలుపెట్టారు. మే 21 నుంచి ఆగస్టు ఎనిమిది వరకు మొత్తం 8,60,38,022 రూపాయలను సైబర్ నేరగాళ్లు ఆ వైద్యుడు నుంచి కొట్టేశారు.
ఇలా మోసపోయాడు
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు చెందిన ఆ వైద్యుడు మే 21న తన ఫేస్ బుక్ ఖాతాను బ్రౌజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి స్టాక్ బ్రోకింగ్ కంపెనీల పేరుతో ఒక ప్రకటన కనిపించింది. భారీగా డబ్బు వస్తుందనే ఆశతో ఆ వైద్యుడు ఆ వివరాలను అందులో నింపాడు. ఆ తర్వాత కొంతమంది ఆ కంపెనీ ప్రతినిధులుగా చెప్పుకుంటూ ఆ వైద్యుడిని వాట్సాప్ లో సంప్రదించారు. ఆ తర్వాత అతడి ఫోన్ నెంబర్ మరో నాలుగు గ్రూపుల్లో చేర్పించారు. “భారీగా లాభాలు అందజేయడం మా బాధ్యత. పలు కంపెనీలకు మేము బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నామని” వారు ఆ వైద్యుడుతో చెప్పారు. ఇది సమయంలో ఆ వైద్యుడు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థల గుర్తింపు, పన్ను రిజిస్ట్రేషన్ గురించి అడిగాడు. అవి రహస్య వివరాలని, వాటిని తమ వెల్లడించలేమని ఆ వ్యక్తులు అన్నారు. అంతేకాదు ఆ నాలుగు సంస్థల పేరుతో కొన్ని యాప్స్ లింకులను అందరికీ పంపించారు. అందులో సూచించిన ఖాతాలకు ఆయన డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇక్కడే ఆ బ్రోకర్లు ముందుగా వచ్చిన లాభాలను తిరిగి తీసుకునేందుకు ఆ వైద్యుడికి అవకాశం ఇచ్చారు. దీంతో అతనికి నమ్మకం కుదిరింది. ఈ క్రమంలో అతడు పలుమార్లు డబ్బు చెల్లించాడు. ఇలా మొత్తం 8.6 కోట్లు ఆ ఖాతాలోకి బదిలీ చేశాడు. లాభాలు తీసుకునేందుకు అతని ప్రయత్నిస్తే.. సైబర్ మోసగాళ్ల అసలు రంగు బయటపడింది. వచ్చిన లాభాల్లో 30% చెల్లిస్తేనే డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వాళ్లు తీరకాసు పెట్టారు. దీంతో మోసపోయానని ఆ వైద్యుడికి అర్థమైంది. దీంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ వైద్యుడి దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బును సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలకు బదిలీ చేశారు. అయితే ఆ వైద్యుడు నగదు బదిలీ చేసిన ఖాతాలను పోలీసులు పరిశీలిస్తే.. అవి దేశ వ్యాప్తంగా ఉన్నాయి. కథ కరీంనగర్ జిల్లా వీణవంక బ్యాంకులో ఉంది. హర్యానా, లూథియానా, ఇండోర్, ఝాన్సీ, చెన్నై, లక్నో, ఢిల్లీ, ముంబై, విశాఖపట్నం, కడప వంటి ప్రాంతాలలో ఖాతాలు ఉన్నాయి. ఆ ఖాతాలలోకి సైబర్ నేరగాళ్లు డబ్బులు బదిలీ చేయడం విశేషం.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Cyber fraud a gang of cyber criminals cheated a hyderabad doctor
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com