Uday Kiran Letter: ఉదయ్ కిరణ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఈ పేరు వెనకాల ఎంత స్ఫూర్తి దాయకమైన కథ ఉందో.. అంతే విషాదకరమైన బాధ కూడా ఉంది. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరో అనిపించుకున్న ఉదయ్.. చివరకు ఆత్మహత్య చేసుకుని చనిపోయే దారుణ పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు. కాగా అతనికి సంబంధించి ఇప్పటీకీ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. కాగా ఇప్పుడు అతను చివరి సారిగా రాసిన లెటర్ ఒకటి నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది.

అయితే ఇది అతను సూసైడ్ చేసుకోవడానికి ముందు రాసిన లెటల్ లాగా అనిపిస్తోంది. కాగా ఈ లెటర్ తన భార్యను ఉద్దేశించి రాసినట్టు తెలుస్తోంది. ఇందులో ఇలా రాసుకొచ్చాడు. విషితా నీతో ఎంతో మాట్లాడాలని ఉంది. కానీ చివరి క్షణంలో నీకు ఈ లెటర్ రాస్తున్నారు. సినిమాల పిచ్చితో ఇక్కడకు వచ్చాను. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ నన్ను పిచ్చివాడిని చేసింది. అందరూ నన్ను దూరం పెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: స్టార్ హీరో సినిమాకు సపోర్ట్ ఇచ్చిన మహేష్ !
నా భార్యగా నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నానంటూ బాధ పడ్డాడు ఉదయ్ కిరణ్. ప్రొడ్యూసర్లు అందరూ నాకు హ్యాండ్ ఇచ్చారు. ఈరోజు ఫోన్ చేస్తునని మాట ఇచ్చిన ప్రొడ్యూసర్ కూడా దూరం పెట్టేశాడు అంటూ అందులో రాసుకొచ్చాడు. తన భార్యను ఉద్దేశించి.. నువ్వు ఎన్ని చెప్పినా వినే పరిస్థితుల్లో లేవు.. వాడు మోసగాడు.. వాన్ని నమ్మొద్దు అంటూ చెప్పాడు. అయితే అతను ఎవరనేది ఇందులో పేరు చెప్పలేదు.
నువ్వు అసలు నిజం తెలుసుకునే రోజు వస్తుందని, కాకపోతే ఆ రోజు నీ పక్కన నేను ఉండనని బాధపడ్డాడు. అందరూ నా వల్లే బాధపడుతున్నామని ఫీల్ అవుతున్నారని.. ఇక నుంచి మీకెవ్వరికీ ఈ బాధ ఉండదని ఆయన ఇందులో పేర్కొన్నాడు. అంతే కాకుండా.. తన భార్య దగ్గర ఉన్న నగలను తన అక్కకు ఇవ్వాలంటూ కోరాడు. తన భార్యను అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకోవాలంటూ కూడా కోరాడు. ఇక తనుకు ఈరోజుతో ఎక్స్ పైర్ డేట్ అయిపోయిందంటూ లెటర్‌ను ముగించాడు. ఈ లెటర్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
Also Read: మంచు ఫ్యామిలీకి ఆహ్వానం ఎందుకు అందలేదు ?