Shiva Shankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ శివ శంకర్ మాస్టర్ జీవితంలోనే పెద్ద డ్రామా ఉంది. 72 సంవత్సరాల వయసులో ఆయన కరోనా సోకి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో కరోనాకి చికిత్స తీసుకుంటున్నా.. వైద్యలు ఆయనను కాపాడలేకపోయారు. దీంతో యావత్ సినీ లోకంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
శివ శంకర్ మాస్టర్ ఇక లేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. అయితే, శివ శంకర్ మాస్టర్ జీవితంలో నాట్యం అనేది స్వతహాగా వచ్చింది. అసలు శివ శంకర్.. డ్యాన్స్ మాస్టర్ గా మారడానికి వెనుక చాలా డ్రామా ఉంది. చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పై శివ శంకర్ మాస్టర్ మమకారం పెంచుకున్నారు.
అందుకే, జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని రకాలుగా అవమానించినా అలాగే ఎవరేమనుకున్నా ఆయన మాత్రం తన డ్యాన్స్ పైనే ఫోకస్ పెట్టారు. చివరకు గొప్ప మాస్టర్ గా తన టార్గెట్ ను రీచ్ అయ్యారు. ఆ రోజుల్లో.. అనగా శివ శంకర్ మాస్టర్ చిన్న తనంలో ఎక్కువగా ‘సభ’ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తూ ఉండేవి.
Also Read: కళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన శివ శంకర్ మాస్టర్ లైఫ్ జర్నీ ఇదే ..!
ఆ సాంస్కృతిక కార్యక్రమాలలో శివ శంకర్ తండ్రి కూడా ఓ సభ్యుడు. దాంతో నాటకాలు, డ్యాన్సులు చూసే అవకాశం శివ శంకర్ మాస్టర్ కి కలిగింది. వాటిని చూసి చూసి, వాటిపై శివ శంకర్‌కు ఆసక్తి కలిగింది. ఎలాగైనా డ్యాన్స్ చేసి తీరాలనే కసి ఆయనలో పెరిగింది. ఆ కసితోనే ఆయన ఆయనంతట ఆయనే డాన్స్ నేర్చుకున్నారు.
పదేళ్ల నుంచి ఆయన తన డ్యాన్స్ నేర్చుకోవడం మొదలు పెడితే.. 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్ లకు వెళ్లి మరీ డ్యాన్సు చేసేంతగా ఆయన డ్యాన్స్ లో బాగా ఎదిగారు. కానీ, ఆయన డ్యాన్స్ చేయడం వాళ్ళ నాన్నకు ఇష్టం లేదు. చదువుకోకుండా ఇలా చేస్తున్నాడని బాగా తిట్టి.. డ్యాన్స్ కు దూరంగా ఉండాలనేవారు. అయినా శివ శంకర్ మాస్టర్ మాత్రం డ్యాన్స్ నే నమ్ముకున్నారు.
Also Read: కరోనాకు కూలిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్
ఇక కొడుకు ఎలాగూ మాట వినడం లేదు అని పెద్ద పెద్ద పండితులకు శివ శంకర్ మాస్టర్ తండ్రిగారు కొడుకు జాతకం చూపించి.. డ్యాన్సర్ గా ఎదుగుతాడా ? అని అడిగితే.. పెద్ద ‘డ్యాన్స్ మాస్టర్ అవుతాడు’ అని చెప్పారట. ఇక అప్పటి నుంచి శివ శంకర్ మాస్టర్ కి ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు.