Shannu Deepu Breakup: ప్రతి రిలేషన్ కి హద్దులు కచ్చితంగా కొన్ని ఉండాలి. ముఖ్యంగా అమ్మాయి అబ్బాయి మధ్య. ఆ హద్దులు వదిలేసి.. విచ్చలవిడిగా కౌగిలించుకుంటూ మేము ఫ్రెండ్స్ అంటే.. నమ్మడానికి కాదు కదా, వినడానికి కూడా బాగోదు. బిగ్ బాస్ షో వేదికగా షణ్ముఖ్-సిరి వ్యవహారం హద్దులు మీరింది. షో బిగినింగ్ నుండి ఎండ్ వరకు ఎన్ని విమర్శలు ఎదురైనా వీరి తీరు మాత్రం మారలేదు. స్వయంగా నాగార్జున హెచ్చరించినా తమ బాండింగ్ వదులుకోవ్వడానికి ఇద్దరూ ఇష్టపడలేదు. హౌస్ లో ఒకరికొకరుగా ఒక్కటిగా తమ మనుగడ సాగించారు. ఒక్క క్షణం విడిగా ఉండేవారు కాదు షణ్ముఖ్, సిరి.

ముఖ్యంగా సిరి అతడి సాంగత్యాన్ని బాగా ఇష్టపడేది. అతగాడు ఛీ అన్నా… చీదరించుకున్నా నువ్వే కావాలి అంటూ సిరి అతని వెంటే పడింది. అలాగే షణ్ముఖ్ కూడా మొదట్లో బెట్టు చేసినా.. సిరి సరదాల పై ముచ్చట పడ్డాడు. ఆమెతో ఎంత గొడవపడ్డా కాసేపట్లో కాంప్రమైజ్ అయ్యేవాడు. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసేవాడు. ఇక సిరి ఎవరికైనా దగ్గరవుతున్నట్లు అనిపిస్తే అసలు తట్టుకోలేకపోయేవాడు. హౌస్ లో సిరి, షన్ను రిలేషన్ ఇంత ఘాటుగా నడిచింది కాబట్టే..దీప్తి సునయన, షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది. చివరకు దీప్తి సునయన, షణ్ముఖ్.. తమ ఘాడమైన ప్రేమ కథకు కలిసికట్టుగా బ్రేకప్ చెప్పేసుకోవాల్సి వచ్చింది.
Also Read: 90% పైగా తక్కువ ధరకే మందులు.. ఇది గొప్ప అవకాశం !
అయితే, షణ్ముఖ్, దీప్తి సునయన లవ్ బ్రేకప్‌పై సిరి హనుమంతు తొలిసారి స్పందించింది. హౌస్‌లో షణ్ముఖ్-సిరి మధ్య ఏర్పడిన క్లోజ్ రిలేషన్ వల్లే దీప్తి బ్రేకప్ చెప్పిందని సోషల్ మీడియాలో సిరిపై తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. అయితే.. వాళ్లిద్దరి బ్రేకప్‌కి తానే కారణం అనడం కరెక్ట్ కాదని ఆమె చెప్పింది. వాళ్లది కేవలం 100 రోజుల్లోనే విడిపోయేంత వీక్ ప్రేమ అని తాను అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది.
మొత్తమ్మీద వాళ్ల బ్రేకప్‌తో నాకు సంబంధం లేదు అని సిరి పాప మొత్తుకుని చెప్పుకొచ్చింది. అయినా షణ్ముఖ్ బాబు – సిరి పాప ‘బిగ్ బాస్ హౌస్’లో చేసిన రొమాన్స్ దెబ్బకు దీప్తి పాప బాగా ఫీల్ అయి.. బాబుకు హ్యాండ్ ఇచ్చింది అని అందరికీ తెలిసిందే.ఏది ఏమైనా వ్యక్తిగత కారణాలతో తమ ప్రేమ బంధానికి పుల్ స్టాప్ పెడుతున్నట్లు ఈ జంట ప్రకటించింది. కానీ, విడిపోతూ కూడా ఒకరి పై ఒకరు అమితమైన ప్రేమను వ్యక్తపరుస్తూ విడిపోయారు.
Also Read: కార్తీక దీపంలో వంటలక్కకు ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా?