Sankranti 2022 Movies: ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు రాకపోయినా పెద్దోళ్ల వారసుల సినిమాలు మాత్రం వస్తున్నాయి. పైగా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ఆ పెద్ద వాళ్ళు రెడీ అయ్యారు. అయినా తెలుగు చిత్రసీమకు ఇది ఏమి కొత్త కాదుగా. నిర్మాతలు, దర్శకులు తమ కొడుకులను హీరోలుగా పరిచయం చేయడం, వాళ్ళ సినిమాలు హిట్ అయినా, ప్లాప్ అయినా వరుసగా వాళ్లతోనే సినిమాలు చేయడం అలవాటు అయిన పనే.
పైగా ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో అగ్ర నిర్మాత అంటే వినిపించే మొట్టమొదటి పేరు ‘దిల్ రాజు’. దిల్ రాజు కుటుంబం నుంచి నిర్మాతలు వచ్చారు గానీ, ఎవ్వరూ హీరోలు మాత్రం రాలేదు. మొదటిసారి దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఓ హీరో రాబోతున్నాడు. దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు ‘ఆశిష్’ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా పేరు ‘రౌడీ బాయ్స్’. ఈ సినిమా పై ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు.

కానీ, సినిమా బాగుంటుంది అని నమ్మకం ఉంది. అనుపమ పరమేశ్వరన్ అందచందాలతో పాటు దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. పైగా ఆశిష్ ని హీరోగా పరిచయం చేయడానికి దిల్ రాజు చాలా కసరత్తులు చేశాడు. మరి జనవరి 14న థియేటర్లో విడుదల కాబోతున్న ఈ ‘రౌడీ బాయ్స్’ ఎలా ఉంటుందో చూడాలి.
ఇక సంక్రాంతికి పరిచయం అవుతున్న మరో పెద్ద ఫ్యామిలీకి చెందిన వారసుడు ‘అశోక్ గల్లా’. ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జయదేవ్ గల్లా కుమారుడిగా కంటే.. హీరో మహేష్ బాబు మేనల్లుడిగానే అశోక్ గల్లా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘హీరో’ అనే పేరుతో అశోక్ గల్లా హీరోగా రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ హీరోగా అశోక్ గల్లా కనిపించబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందింది ఈ సినిమా.
Also Read: సంచలనాలకు కేరాఫ్.. హీరో యశ్ జీవితం..!

పైగా బోల్డ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ గా కనిపించబోతుంది. ఈ సినిమా కోసం నిధి బికినీ కూడా వేసింది. మరి తన బికినీతో యువకుల గుండెల్లో ఏ స్థాయిలో గిలిగింతలు పెడుతుందో చూడాలి.