SS Rajamouli-MM Keeravani: టాలీవుడ్ లో రాజమౌళి, కీరావాణిలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తుంటారు. అయితే చాలా మందికి వీరి అనుబంధం గురించి పెద్దగా తెలియదు. వాస్తవానికి వీరిద్దరూ అన్నదమ్ములు. ఒకే ఇంటికి చెందిన వ్యక్తులు. కాకపోతే వీరిద్దరి పేర్లకు ముందు అంటే రాజమౌళికేమో ఎస్ ఎస్ అని, కీరవాణికి ఏమో ఎమ్ ఎమ్ అని ఉంటాయి. మరి ఒకే ఇంటికి చెందిన వ్యక్తులకు ఇలా వేర్వేరు పేర్లు ఎందుకు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇంటిపేరు కోడూరి. వీరిద్దరి ఇంటిపేరు కూడా అదే. పైగా ఇండస్ట్రీలోనే ఉన్న మరో మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి కోడూరి ఒక్కరే ఇంటి పేరుతో అందరికీ పరిచయం ఉన్నారు. కానీ కోడూరి రాజమౌళి అన్నా లేదంటే కోడూరి కీరవాణి అన్నా ఎవరూ పెద్దగా గుర్తు పట్టరు. ఎస్ ఎస్ రాజమౌళి, లేదంటే ఎమ్ ఎమ్ కీరవాణి అంటేనే గుర్తు పడతారు. అంతలా వీరిద్దరి పేర్లు పాతుకు పోయాయి.

Also Read: రవితేజతో ఎక్స్ పీరియన్స్ బాగుంది – అనసూయ
అయితే రాజమౌళి పేరుకు ముందు ఎస్ ఎస్ రావడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఆయన పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. శ్రీశైల శ్రీ అంటే చాలా పెద్దగా అయిపోతుందని దాన్ని షార్ట్ కట్ లో SS అక్షరాలకి తగ్గించేశారు. అందుకే ఆయన ఎస్ ఎస్ రాజమౌళిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కీరవాణి పేరు కూడా ఇలాంటిదే.
ఆయన పూర్తి పేరు మరకతమణి కీరవాణి. అయితే ఈ పేరును కూడా షార్ట్ కట్ చేసేసి ఎమ్ ఎమ్ కీరవాణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ప్రేమించు, అదిరిందయ్యా చంద్రం సినిమాలకు మ్యూజిక్ అందించిన ఎంఎం శ్రీలేఖ వీరి సిస్టర్. ఆమె పేరు మణిమేఖల శ్రీలేఖ. దాంతో ఆమె పేరు ముందు కూడా ఎమ్ ఎమ్ అనే పేరు ఆడ్ అయిపోయింది. ఇలా ఒకే ఇంటి నుంచి వచ్చి పేర్లు తగ్గించుకుని అగ్ర దర్శకుడిగా ఒకరు, అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ గా మరొకరు రాణిస్తున్నారన్న మాట.
Also Read: ‘సమంత – నయనతార’ సినిమాలో ఫేమస్ క్రికెటర్ !
[…] […]
[…] […]