Homeసినిమా వార్తలుబ్రేకింగ్స్Meera Jasmine : హాట్ ఫోజులతో రెచ్చిపోయిన మీరా జాస్మిన్ !

Meera Jasmine : హాట్ ఫోజులతో రెచ్చిపోయిన మీరా జాస్మిన్ !

Meera Jasmine : మీరా జాస్మిన్ అనగానే ఫ్యామిలీ రోల్స్ గుర్తుకు వస్తాయి. అంతగా ఆమె ఫ్యామిలీ హీరోయిన్ గా చలామణి అయింది.  మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తోంది. అయితే సోషల్‌ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండేది కాదు, కానీ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ తెరిచి.. హాట్ హాట్ ఫోటో షూట్స్ కూడా చేస్తోంది.  39 ఏళ్ల వయసులో అదిరిపోయే ఫోటోషూట్ చేసింది మీరా జాస్మిన్. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

Meera Jasmin
Meera Jasmin

కాగా ఒకప్పుడు చాలా సాంప్రదాయంగా కనిపించిన మీరా జాస్మిన్ ఇప్పుడు గ్లామర్ షోకు దిగడానికి కారణం ఏంటి అని అభిమానులు నెట్టింట్లో కామెంట్ చేస్తున్నారు. మూవీల్లో అవకాశాల కోసమే ఫొటో షూట్ చేసిందని అంటున్నారు. కాగా 2014లో పెళ్లి చేసుకున్న తర్వాత మూవీలకు బ్రేకిచ్చింది మీరా. మళ్లీ రీఎంట్రీకి ప్రయత్నాలు చేస్తోంది.

  Meera Jasmine
Meera Jasmine


జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన మీరా, ప్రస్తుతం మకల్‌ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది.   గుడుంబా శంకర్‌, గోరింటాకు వంటి చిత్రాలతో తెలుగు సినీ అభిమానులకు పరిచయమైన మీరా జాస్మిన్‌,    డీసెంట్ క్యారెక్టర్స్ తో   బాగా  అలరించింది. అలాగే  యువ లాంటి సినిమాల్లో హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుకి నిద్ర కూడా లేకుండా  చేసింది. 

 

ఏది ఏమైనా మీరా జాస్మిన్ కి  ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఒకప్పుడు  స్టార్ హీరోయిన్ గా  పవన్ కళ్యాణ్, విక్రమ్, రవితేజ, విశాల్ వంటి పెద్ద హీరోల సరసన ఆడిపాడి.. తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించింది.  సౌత్ లో  తెలుగు, తమిళ సినిమా రంగాల్లో ఫుల్ క్రేజ్ తో వరుస హిట్స్ అందుకుని.. దాదాపు పదేళ్ల పాటు ఫుల్ బిజీగా సినిమాలు చేసింది.  

అయితే  పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ సీనియర్ ఫ్యామిలీ హీరోయిన్.. ఇప్పుడు మళ్ళీ సినిమా కెరీర్ పై ఫోకస్ పెట్టిందని..  ప్రస్తుతం తన మకాంను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసుకుందని.. గతంలో తనతో సినిమాలు చేసిన హీరోలను దర్శకులను కలిసి మీ సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వండి అంటూ  మీరా అందర్నీ రిక్వెస్ట్ చేస్తోందట.  ఉన్నట్టు ఉండి  మీరా జాస్మిన్ సినిమాల పై ఫోకస్ పెట్టడానికి గల కారణం.. ఆర్ధిక ఇబ్బందులు అట.  

ఆమె తన భర్త నుంచి విడిపోయిందని..  అలాగే ఆమెకు కొన్ని ఆర్ధిక ఇబ్బందులు కూడా ఉన్నాయని.. ఆమెను కొంతమంది కుటుంబ సభ్యులే మోసం చేశారని.. దాంతో సేవింగ్స్ అన్ని వడ్డీలకే కట్టాల్సి  వచ్చిందని.. ప్రస్తుతం సినిమాల్లో తిరిగి నటించడం తప్ప.. ఆమెకు మరో ఆప్షన్ లేదని.. అందుకే అవకాశాల కోసం అందర్ని రిక్వెస్ట్ చేస్తోందని తెలుస్తోంది.    

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

  1. […] Health Tips: దాదాపుగా ప్రతీ ఒక్కరు తీసుకునే ఆహార పదార్థాలు ఎగ్ కంపల్సరీగా ఉంటుందని చెప్పొచ్చు. శాకాహారులు సైతం ఎగ్ ను తీసుకుంటారు. దీనిని శాకాహారంగానే భావిస్తారు కూడా. ఇకపోతే ఈ గుడ్లను రకరకాలుగా తీసుకుంటుంటారు. యాజ్ ఇట్ ఈజ్‌గా కాకుండా కొందరు ఉడకబెట్టుకుని తీసుకుంటారు. మరి కొందరు ఫ్రై చేసుకుంటారు. ఇంకొందరు ఆమ్లెట్లు వేసుకుంటారు. కాగా, గుడ్లను తీసుకోవడం వల్ల కలిగనే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular